సిడ్నీలో ఎన్నారై మహిళ కిడ్నాప్

Nri Women
Ganesh|
FILE
కుటుంబ సభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా ఓ ఆస్ట్రేలియన్‌ను వివాహం చేసుకున్నందుకుగానూ.. ఒక భారత సంతతి మహిళ సిడ్నీలో కిడ్నాప్‌కు గురయ్యింది. సిడ్నీలోని స్టార్త్‌ఫీల్డ్ ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు స్థానిక రేడియో ఛానెల్ ఒక కథనాన్ని వెల్లడించింది.

ఈ కిడ్నాప్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించిన యువతి చేతి వేళ్లను కొరికి ఇద్దరు దుండగులు ఆమెను అపహరించుకు పోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఆ యువతి భర్త తలకు కూడా గాయమయ్యిందనీ, చికిత్స నిమిత్తం అతడిని రాయల్ ప్రిన్స్ ఆల్‌ఫ్రెడ్ ఆసుపత్రిలో చేర్పించినట్లు పోలీసులు పేర్కొన్నారు.

కాగా.. దుండగుల బారి నుంచి బాధితురాలిని విడిపించామనీ, ఆ కిడ్నాపర్లలో ఒకరు ఆ యువతి సోదరుడేనని పోలీసులు వివరించారు. అయితే కుటుంబ సభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకుందన్న కారణంతోనే వారు ఈ కిడ్నాప్‌కు పాల్పడ్డారని, నిందితుల్ని పట్టుకునేందుకు తీవ్రంగా గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


దీనిపై మరింత చదవండి :