ప్రముఖ బాలీవుడ్ గాయని సునిధి చౌహాన్‌కు దక్షిణాఫ్రికాలో ఓ చేదు అనుభవం ఎదురయ్యింది. సునిధి ధరించే ఆభరణాలను జప్తు చేసేందుకు డర్బన్ హైకోర్టు అనుమతి ఇవ్వటంతో రెండు రోజులపాటు ప్రదర్శన ఇచ్చేందుకు అక్కడికి వెళ్లిన ఆమెకు గొంతులో పచ్చివెలగకాయ పడినట్లయ్యింది.