"స్పోర్ట్స్ ఇల్లస్ట్రేటెడ్"కు స్విమ్‌ సూట్‌లో ఫోజిచ్చిన ఎన్నారై

Nri Women
Ganesh|
FILE
భారత సంతతికి చెందిన అమెరికన్ మోడల్ సోనియా డరా "స్పోర్ట్స్ ఇల్లస్ట్రేటెడ్" పత్రికలో స్విమ్‌ సూట్ అందాలతో పాఠకులకు కనువిందు చేస్తోంది. తద్వారా ఈ పత్రికలో ఫోజిచ్చిన తొలి భారత సంతతి మోడల్‌గానే కాకుండా, తొలి ఆసియాన్‌గా కూడా సోనియా గుర్తింపును సంపాదించుకుంది.

హార్వర్డ్ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్రం అభ్యసిస్తున్న ఈ మోడల్ అమ్మడు యాక్టర్స్, మోడల్స్ అండ్ టాలెంట్ కాంపిటీషన్ (ఏఎంటీసీ) ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అప్పటికి ఆమె వయసు పదహారు సంవత్సరాలు మాత్రమే. ఇదిలా ఉంటే.. సానియా తన అందాలతో కనువిందు చేసిన 2010 స్పోర్ట్స్ ఇల్లస్ట్రేటెడ్ మ్యాగజైన్ అమెరికాలో ప్రస్తుతం లభ్యమవుతోంది.

స్పోర్ట్స్ ఇల్లస్ట్రేటెడ్ పత్రికలో కనిపించటం ద్వారా ప్రజల్లో మంచి గుర్తింపు వస్తుందని సోనియా భావిస్తున్నట్లు ఆ పత్రిక వెబ్‌సైట్‌లో ఉంచిన వీడియోలో వెల్లడించింది. కాగా.. సోనియా స్విమ్ సూట్ ఫొటోలను భారత్‌లోని రాజస్థాన్‌లో గల అందమైన ప్రదేశాలలో తీసినట్లు తెలుస్తోంది. రాజస్థాన్‌లోని అద్భుతమైన ప్రదేశాలలో ఫొటోగ్రాఫర్ రికార్డు టినెలీ తీసిన ఈ ఫొటోలు చాలా బాగా వచ్చాయని ఆమె సంతోషం వ్యక్తం చేస్తోంది.

కాగా.. అమెరికాలో ప్రముఖ పత్రిక స్పోర్ట్స్ ఇల్లస్ట్రేటెడ్ స్విమ్ సూట్ ఇష్యూను మొదట 1964లో ప్రచురించింది. అప్పటినుంచి సూపర్ మోడల్‌లు ఈ పత్రికలో దర్శమివ్వటం ఆనవాయితీగా మారిపోయింది. చెరిల్ టైగ్స్, సిండి క్రాఫోర్డ్, హెడీ కుమ్, నెమో కాంప్‌బెల్, టైరా బ్యాంక్స్ తదితరులు ఈ పత్రికలో తమ అందాలను ఆరబోసారు. అయితే ఈ సంవత్సరం ముఖచిత్రంపై అమెరికన్ మోడల్ బ్రూక్లిన్ డెకర్ కనువిందు చేయనుంది.


దీనిపై మరింత చదవండి :