మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో నిందితురాలైన ఎన్నారై మహిళను మలేషియా పోలీసులు అరెస్టు చేశారు. మాదక ద్రవ్యాల స్మగ్లింగ్‌కు పాల్పడిన నేరంపై ఒక భారత మహిళతో సహా నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు మలేషియా అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా నిందితుల వద్ద నుంచి ఆరు పాకెట్ల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు నార్కోటిక్స్ విభాగంలోని నేర విచారణాధికారి కాంగ్ చెజ్ చియాంగ్ పేర్కొన్నారు. నిందితులు మరికొన్ని మాదక ద్రవ్య పదార్థాలను నిందితులు లాప్‌టాప్‌లో దాచారన్నారు.