ఇటీవల తెలుగు ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. పాత చిత్రాలను తిరిగి మళ్ళీ తీసేందుకు నిర్మాతలు ఉత్సాహాన్ని కనబరుస్తున్నారు. మొన్ననే రామానాయుడు 'రాముడు-భీముడు' వంటి చిత్రాన్ని మళ్లీ ఈనాటి జనరేషన్ ఎన్.టిఆర్.తో తీయనున్నట్లు ప్రకటించారు. కానీ ఎన్టీఆర్ డేట్స్ ఇవ్వకపోవడంతో... రామానాయుడు మనవుడు రానా తాను చేస్తానని చెప్పాడు. నీకు సూట్ కాదురా అని సున్నితంగా తిరస్కరించారు కూడా. అయితే... గురువారంతో 'గుండమ్మకథ' చిత్రం యాభై ఏళ్ళు అయిన సందర్భంగా ఆ చిత్రాన్ని తీయడానికి చాలా మంది ముందుకు వస్తున్నట్లు... ఫలానా పాత్రను ఫలానావారు చేస్తున్నట్లు వార్తలు విన్పించాయి.