బెంగాలీ తార సుచిత్రా సేన్ ఆనాటితరం ప్రేక్షకులకు కలలరాణి. ఆమె హీరోయిన్‌గా నటిస్తూ సినిమా వచ్చిందంటే కాసుల పంట కురుసేది. ఐతే ఆమె గత 3 దశాబ్దాలుగా బయటి ప్రపంచానికి దూరంగా కాలం వెళ్లబుచ్చారు. ముఖ్యంగా ఆమె 1978లో నటించిన 'ప్రొనొయ్ పాషా' అనే చిత్రం అపజయం అయిన తర్వాత సుచిత్రా సేన్ బాహ్య ప్రపంచానికి దూరంగా జరిగారు. ఈ కాలంలో ఆమెకు ఎంతో ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చినా దానిని అందుకునేందుకు తిరస్కరించారు.