కర్నాటక : బెంగుళూరు

WD|
మనదేశంలో అందాల నగరంగా పేరొందిన వాటిలో బెంగుళూరు ఒకటి. దీనికి `ఉద్యానవనాల నగరం' అని మరో పేరు కూడా ఉంది. అందమైన తోటలకు, నయనానందకరమైన ఉద్యానవనాలకు బెంగుళూరు పెట్టింది పేరు. ఏడాదిపొడవునా చల్లటి ఆహ్లాదకరమైన వాతావరణం ఉండటం ఈ నగరం మరో ప్రతే్యకత. అందుకే ఎందరికో ఈ నగరం `వేసవి విడిది'గా మారింది. హనీమూన్‌కు వచ్చే జంటలతో బెంగుళూరు ఎప్పుడూ సందడిగా ఉంటుంది.

సముద్ర మట్టానికి వెయ్యి మీటర్ల ఎత్తున ఉన్న ఈ అందాల నగరాన్ని కర్ణాటక రాష్ట్ర రాజధాని కెంపెగౌడ అనే రాజు 1537లో నిర్మించాడు. చారిత్రక ప్రసిద్ధి గాంచిన ఈ నగరం ఇప్పుడు `సిలికాన్‌ వ్యాలి ఆఫ్‌ ఇండియా'గా కొత్తరూపు సంతరించుకుంది. ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగంలో వచ్చిన మార్పులను అందిపుచ్చుకోవడమే ఇందుకు కారణం.

చూడాల్సిన ప్రదేశాలు

విధానసౌధ : రాష్ట్ర అసెంబ్లీ, సచివాలయంతో కూడిన భవన సముదాయమిది. 1956లో అప్పటి ముఖ్యమంత్రి కెంగల్‌ హనుమంతయ్య `విధానసౌధ' నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. భవనాలన్నింటినీ బెంగుళూరు గ్రానైట్‌ రాతితో నిర్మించడం దీని ప్రత్యేకత.

అత్తరకచేరి : విధానసౌధ ఎదురుగా గల రెండతస్తుల భవనమే `అత్తరకచేరి'. దీనికి మరోపేరు స్టేట్‌ హైకోర్టు. ఇక్కడకు దగ్గర్లోనే లైబ్రరీ, గవర్నమెంట్‌ మ్యూజియం, విశ్వేశ్వరాయ ఇండస్ట్రియల్‌ టెక్నలాజికల్‌ మ్యూజియం, వెంకటప్ప ఆర్ట్ గ్యాలరీ ఉన్నాయి.


దీనిపై మరింత చదవండి :