శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. »
  3. పర్యాటక రంగం
  4. »
  5. ఇతర చూడదగ్గ ప్రాంతాలు
Written By WD

తమిళనాడు రాష్ర్ట రాజధాని

చెన్నై (మద్రాసు)
ఈ మహానగరంలో ద్రావిడ సంస్కృతిని ప్రస్ఫుటంగా చూపించే అనేక దేవాలయాలు, సుందరమైన బీచ్‌లు, అరుదైన స్నేక్‌ పార్క్, ఎన్నో సంవత్సరాల నాటి పురాతన మర్రిచెట్టు వున్నాయి. అలనాటి భవనాలు, అనేక స్టూడియోలతో ఈ మద్రాసు మహానగరం పర్యాటకుల పాలిటి సుందరప్రదేశం.

గవర్నమెంట్‌ మ్యూజియం : 1857లో వ్యవస్తీకరించబడింది. ఇందులో భూగర్భ శాస్త్రం, వృక్షశాస్త్ర విభాగం, మానవజాతి, జంతుశాస్త్ర విభాగాలున్నాయి. ఓపిక వుండి చూడాలేగాని పాతరాతి యుగం నుండి కొత్త రాతి యుగం వరకు ఉపయోగించిన పనిముట్లు, బౌద్ధ శిల్పాలు, అశోకుని కాలం నాటి లిపి, బ్రిటీషు కాలం నాటి ఆయుధాలు లాంటివెన్నో ఈ మూ్యజియంలో వున్నాయి. ప్రవేశం ఉదయం 8గంటల నుండి సాయంత్రం 5 వరకు ఉంటుంది. శుక్రవారం సెలవు.

హైకోర్టు : 1892లో నిర్మించిన ఈ భవనం ఎరన్రి ఇటుకలతో పటిష్టంగా కట్టబడింది. ఇది మద్రాసు బస్టాండుకి సమీపంలో ఉంది.

లైట్‌హౌస్‌ : ఇది మెరినా బీచ్‌ సమీపంలో రేడియో స్టేషన్‌కి ఎదురుగా 58 మీటర్ల ఎత్తులో లైట్‌హౌస్‌ గోపురం వుంది. ఇది పది అంతస్తుల మేడ. దీన్ని ఎక్కి చూస్తే చెనై్న మహానగరపు అందచందాలు కనబడుతున్నాయి. ఈ లైట్‌ హౌస్‌లోకి ప్రవేశం రోజు మధ్యాహ్నం 2 నుంచి 4 వరకు.

సెయింట్‌ జార్జి కోట : 1640లో ఈస్టిండియా కంపెనీ వారిచే నిర్మించబడింది. ఇందులో బ్రిటీషు వారి తొలి నాళ్ళ జ్ఞాపకాలు గుర్తు చేసే ఎన్నో నిదర్శనాలున్నాయి. ఇక్కడున్న స్తంభం ఇండియాలో కెల్లా ఎత్తయినది.

మెరీనా బీచ్‌ : 12 కి.మీ పొడవైన పెద్ద బీచ్‌. పెద్ద పెద్ద సభలు కూడా ఇందులో జరుపుతారు. సాయంత్రం పూట వెళ్తే తిరునాళ్ళలా వుంటుంది. ఒడ్డున హార్‌‌స రైడింగ్‌ కూడా చేయవచ్చు. సాయంత్రం పూట ఉల్లాసంగా మానసిక ప్రశాంతి పొందడానికి అనువైన స్థలం ఈ బీచ్‌. పక్కనే పెద్ద హార్బరు వుంది.

అన్నా సమాధి : శ్రీ సి. ఎస్‌ అణ్ణాదురై గొప్ప రాజకీయవేత్త. డి. ఎం.కె., ఏ.డి. ఎం.కె పార్టీలు పుట్టకముందే ఈయన పార్టీ పెట్టి తమిళనాడు రాజకీయాలకి పునాదులు వేసిన ఏకైక స్మారక చిహ్నం. ఇది మెరీనా బీచ్‌కి సమీపంలోనే ఉంది. అతి దగ్గరలోనే ఎం.జి.రామచంద్రాన్ని ఖననం చేసింది. బీచ్‌ ఒడ్డున తమిళనాడుకు విశేష సేవ చేసిన ప్రతిభావంతుల విగ్రహాలున్నాయి.

అడయారు మర్రిచెట్టు : అడయారు నదీతీరంలో వున్న ఊడలు దించుకున్న ఈ మర్రిచెట్టు వయస్సు వందల సంవత్సరాలే. ఇందులో విశిష్టత ఏమిటంటే ఇంతటి పెద్ద మర్రిచెట్టుని మనం ఎక్కడ కనీవినీ ఎరిగి ఉండం.

అష్టలక్ష్మీ దేవాలయం : ఈ దేవాలయం బెసంట్‌ నగర్‌లో వుంది. అష్ట లక్ష్మీ దేవీలను దర్శించాలంటే తప్పక ఈ దేవాలయాన్ని సందర్శించవలసిందే. ఒక్కొక్క అంతస్తులోను ప్రతిష్టించిన లక్ష్మి స్వరూపాన్ని చూస్తుంటే నాస్తికులు సైతం ఆస్తికులుగా మారవలసిందే. ఎదురుగా అద్భుతమైన సముద్రం అమ్మవారి పాల సముద్రాన్ని గుర్తుకు తెస్తూ కనిపిస్తుంది.

పార్థసారధి టెంపుల్‌ : 8వ శతాబ్దంలో పల్లవరాజుచే నిర్మించబడినది. ట్రిప్లికేన్‌ ఏరియాలో ఉంది. ఇది విష్ణు ఆలయం. 16వ శతాబ్దంలో విజయనగరరాజులు ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు. ఈవినింగ్‌ బజారులో శ్రీ చెన్నకేశవ పెరుమాళు్ళ, జార్జి టౌనులో కందస్వామి కోవెల, మైలాపూర్‌లో శ్రీ కపిలేశ్వరస్వామి ఆలయం, అన్నామలైపురంలో అయ్యప్పస్వామి దేవాలయం, తిరువళ్ళిక్కేళిలో రాఘవేంద్ర స్వామి ఆలయం, శ్రీ కామాక్షి అమ్మన్‌ కోవెల మాంగాడులో, మూకాంబికా దేవాలయం కుండ్రుత్తూరులోనూ వున్నాయి. శ్రీ రామకృష్ణ మఠం, శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయం వద్ద గౌడియా మఠం రాయపేటలో వుంది.

గాంధీ మండపం : మహాత్మాగాంధీ, ఆఖరి భారతీయ గవర్నర్‌ జనరల్‌ రాజాజీ, కామరాజ్‌ నాడార్‌ చిహ్నాలున్నాయి. ఇవన్నీ అడయార్‌లో వున్నాయి.

చిల్డ్రన్స్ పార్క్ (పిల్లల పార్క్) : ఉయ్యాలలు, జారుడు బండలు గల ఇక్కడ ఏనుగుల మీద, ఒంటెల మీద సవారీ చేయవచ్చు. రకరకాల జంతువులను, పక్షులను చూడవచ్చు. ప్రవేశం ఉదయం 8.30 నుండి సాయంత్రం 5.30 గంటల వరకు. మంగళవారం సెలవు.

వళ్ళువర్‌ కోట్టం : మన ఆంధ్రులకు వేమన ఎంతటి గొప్పవాడో, అలాగే తమిళ ప్రజలకు వళ్ళువర్‌ అనే మహాకవి అంతటివాడే. ఆయన గుర్తుగా సంస్మరిస్తూ నిర్మించిన చక్కని మందిరం. ఈయన తమిళ సాహితీ రంగానికి ఆద్యులు. ఈ ఆడిటోరియం ఎటువంటి స్తంభాల సపోర్టు లేకుండా వుంది.

మౌంట్‌రోడ్‌ : మద్రాసు సిటీలో కమర్షియల్‌ ఏరియా. అనేక షాపింగ్‌ సెంటర్స్, సినిమా హాళ్ళు గలవు. మద్రాసులోనే అతి ఎత్తైన బిల్డింగ్‌ ఎల్‌. ఐ.సి., ఇది కూడా మౌంట్‌రోడ్‌లోనే వుంది.

పాండిబజార్‌ : ఇది టి.నగర్‌లో ఒక ప్రసిద్ధి గాంచిన వీధి. ఇక్కడ నిత్యం వ్యాపార వ్యవహారాలు కొనసాగుతుంటాయి. ఒక విధంగా షాపింగ్‌ సెంటర్‌ మరియు సినిమా డిస్ట్రిబ్యూటర్‌‌స బస చేసే రెస్‌‌ట హౌస్‌లు గల వీధి. తెలుగు వారు ఎందరో ఈ వీధికి వచ్చి పోతుంటారు.

స్నేక్‌ పార్క్ : ఎన్నో రకాల పాములు, మొసళ్ళు, తాబేళ్ళు అనేకం చూడగలం. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ప్రవేశం. ప్రతి గంటకు లెక్చర్‌, డెమాన్ట్రేన్స్ ఉంటాయి. పాముల నుంచి విషం తీయడం లాంటి అరుదైన దృశ్యాలను చూడవచ్చు.

కళాక్షేత్రం : ఇది లలిత కళల దేవాలయం. 100 ఎకరాల స్థలంలో వున్న ఈ కళాక్షేత్రంలో భారతీయులతో పాటు ఎందరో విదేశీయులు అభ్యసిస్తున్నారు. భరతనాట్యం, కథాకళి, కర్నాటక సంగీతం గురించి ప్రతే్య బోధనా పద్ధతుల ద్వారా చెప్పే ఇక్కడ వస్త్రములపై డిజైనులు చేసే ప్రతే్యక కోర్సు కూడా వుంది.

కన్నెమెరా లైబ్రరీ : 1961లో నిర్మించిన ఈ గ్రంథాలయంలో అనేక గ్రంథములున్నాయి. ఇక్కడున్న మ్యూజియంలో పాత నాణెలు, ఆయుధాలు, అనేక శిల్పాశిల్పాలు చూడవచ్చు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 వరకు ప్రవేశం.