మాఘమాసం.. 13 నుంచి 15 వరకు మంచి ముహూర్తం.. రాష్ట్రానికి పెళ్లికళ!

SELVI.M|
FILE
రాష్ట్రానికి పెళ్లికళ వచ్చేసింది. మాఘమాసంలో మంచి ముహూర్తాలు 13 నుంచి 15వరకు ఉండటంతో భారీగా పెళ్లి బాజాలు మోగనున్నాయి. మాఘమాసంలో 13వ తేదీ నుంచి 15వరకే మంచి ముహూర్తాలుండటంతో పాటు అటు పిమ్మట బలమైన ముహూర్తం లేకపోవడంతో ఈ మూడు రోజుల్లో రాష్ట్రంలో లక్ష పెళ్ళిళ్లు జరగనున్నాయి.

ఈ మూడు రోజుల్లో 14వ తేదీ మంచి ముహూర్తమని, మాఘ శుద్ధ చవితి, రేవతి నక్షత్రం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో పెళ్లిళ్లు జరుగనున్నాయి. ఇంకా ఈ 14న ప్రేమికుల రోజు కావడంతో అనేక జంటలు ప్రేమికుల రోజునే పెళ్లి రోజు చేసుకోవాలనుకుంటున్నాయి. ఈ క్రమంలో అనేక మంది వధూవరులు పెళ్లి బంధంతో ప్రేమికుల రోజున ఒకటవనున్నారు.


దీనిపై మరింత చదవండి :