సోమవారం, 16 మార్చి 2026
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : గురువారం, 5 ఫిబ్రవరి 2026 (11:36 IST)

Mahashivratri 2026: మహా శివరాత్రి రోజున రాజయోగాలు.. ఆ మూడు రాశులకు అదృష్టం

Lord Shiva
Lord Shiva
మహా శివరాత్రి రోజున రాజయోగాలు ఏర్పడనున్నాయి. చతుర్గ్రహి, బుధాదిత్య, సర్వార్థ సిద్ధి వంటి యోగాలు 3 రాశులకు భారీ ప్రయోజనాలను అందించనున్నాయి. ఈ మహాశివరాత్రి రోజు ఏర్పడే ఈ అరుదైన యోగం మేష రాశి వారికి ఎన్నో లాభాలను తెచ్చి పెట్టనున్నాయి. 
 
కొత్తగా పెట్టుబడులు పెట్టిన వారికీ ఆకస్మిక ఆర్థిక లాభాలు వస్తాయి. దీంతో, మీ ఆర్థిక సమస్యలు మొత్తం పోతాయి. అంతేకాదు, మీరు మొదలు పెట్టే ప్రతి పనిలో శివుని ఆశీస్సులు ఉంటాయి. 
 
అలాగే మహాశివరాత్రి రోజు ఏర్పడే ఈ అరుదైన యోగం కన్యారాశి వారి అదృష్టం రెట్టింపు అవుతుంది. ఈ రాశి వారు కెరీర్‌లో దూసుకెళ్తారు. ఈ రాశి వారు కెరీర్‌లో దూసుకెళ్తారు. మొదలు పెట్టిన వ్యాపారాల్లో అధిక ఆదాయాన్ని పొందుతారు. ఈ మహా శివరాత్రి నుంచి మంచి రోజులు రానున్నాయి.
 
కుంభ రాశి వారికి చాలా ప్రత్యేకమైనదని చెప్పాలి. ఎందుకంటే, త్వరలో వాళ్ళకి కొత్త ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారి కల కూడా నెరవేరుతుంది. ఆర్ధిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. వ్యాపారాలు కూడా విస్తరించనున్నాయి.