1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
  4. Akshaya Tritiya 2026: A powerful combination of Krittika Nakshatra and Ayushman Yoga

Akshaya Tritiya 2026: అక్షయ తృతీయ రోజున అద్భుత కలయిక.. ఉప్పు, గవ్వలతో ఇలా చేస్తే?

Akshaya Tritiya 2026
Akshaya Tritiya 2026
అక్షయ తృతీయ రోజున 19 ఏప్రిల్ 2026 ఆదివారం కృత్తిక నక్షత్రం కలవడం అద్భుతమైన కలయిక. ఈ రోజున కుమార స్వామిని పూజించడం ద్వారా సర్వాభీష్ఠాలు చేకూరుతాయి. ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామికి అభిషేక ఆరాధనలు చేయించడం రాహు కేతు దోషాలను నివృత్తి చేస్తుంది. అలాగే అక్షయ తృతీయ రోజున కృత్తిక నక్షత్రం, ఆయుష్మాన్ యోగాల అద్భుత కలయిక జరుగతుంది.
 
అలాగే శ్రీకృష్ణుడు పాండవులకు అక్షయ పాత్రను అనుగ్రహించిన పవిత్ర దినం. అందుకే ఈ రోజున (19వ తేదీన) మార్కెట్ నుండి ఉప్పును కొనుగోలు చేసి, దానిని ఒక గాజు పాత్రలో నింపాలి. ఆ పాత్రను ఇంటి ఈశాన్య దిశలో (ఈశాన్య మూల) ఉంచాలి.
ఇలా చేయడం పేదరికాన్ని తొలగిస్తుంది
ఇంట్లో శాంతిని నెలకొల్పుతుంది
వాస్తు దోషాలను నివారిస్తుంది
అనారోగ్య సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది
అడ్డంకులను తొలగించి, నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తుంది.
 
అలాగే ఏప్రిల్ 19, ఆదివారం నాడు అక్షయ తృతీయ తిథి ఉదయం 10:50 గంటలకు ప్రారంభమై ఏప్రిల్ 20, ఉదయం 7:28 గంటలకు ముగుస్తుంది. ఆ రోజున 11 గవ్వలను ఎర్రటి వస్త్రంలో కట్టి పూజ గదిలో ఉంచడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయని పండితులు అంటున్నారు. 
 
కృత్తిక నక్షత్రం, ఆయుష్మాన్ యోగంతో కలిసి వచ్చే ఈ పండుగను సర్వ సిద్ధి ముహూర్తంగా పరిగణిస్తారు. ఈ రోజున దానధర్మాలు చేయడానికి, బంగారం, వెండి, భూమి లేదా వాహనాలు కొనడానికి సర్వ శుభంగా చెప్తారు.
About Writer
సెల్వి