గురువారం, 28 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. »
  3. భవిష్యవాణి
  4. »
  5. పంచాంగం
Written By Selvi
Last Updated : శుక్రవారం, 6 జూన్ 2014 (18:35 IST)

మీరు జూన్ 3, 12, 21, 30 తేదీల్లో జన్మించారా?

మీరు జూన్ 3, 12, 21, 30 తేదీల్లో జన్మించారా.. అయితే ఉన్నత పదవులను అలంకరిస్తారని సంఖ్యాశాస్త్ర నిపుణులు అంటున్నారు. ప్రభుత్వాధికారులగానూ రాణిస్తారు. కేసులు సానుకూల ఫలితాలనిస్తాయి. భవన నిర్మాణాలు పూర్తవుతాయి. మేనమామ, బంధువుల నుంచి గౌరవం లభిస్తుంది. 
 
మీ సంతానం మీరు చెప్పినట్టే వింటారు. చేతికందవలసిన రుణాలు అందుతాయి. మీ స్నేహితులు మీ బలహీనతలను తెలుసుకుని ప్రవర్తిస్తారు. మీకు నచ్చిన విధంగా వాహనాలు కొనుగోలు చేస్తారు. సోదరులు మీకు అన్ని విధాలా సాయం చేస్తారు. అప్పులు తీరుతాయి. ఇతరులను అంత సులువుగా నమ్మకండి. తీర్థయాత్రలు చేస్తారు. 
 
ఈ సంఖ్యలో పుట్టిన అమ్మాయిలకు నచ్చిన వారితో వివాహం జరుగుతుంది. వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్ ఉంటుంది. మీ నైపుణ్యాన్ని పెంచుకుంటారు.
 
అదృష్ట తేదీలు :3, 1, 9, 10, 27
లక్కీ నెంబర్స్ : 3, 9
లక్కీ కలర్స్ : సిల్వర్ గ్రే, పసుపు రంగులు కలిసొస్తాయి. 
అదృష్ట రోజులు : ఆది, శుక్ర వారాలు.