1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
  4. Astrology: Which are the three zodiac signs closest to Lord Hanuman?

జ్యోతిష్య శాస్త్రం: హనుమంతుడి దగ్గరయ్యే ఆ మూడు రాశులేవి?

Hanuman
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, కొన్ని రాశుల వారు హనుమంతునితో గాఢమైన ఆధ్యాత్మిక అనుబంధాన్ని అనుభూతి చెందుతారు. వారు ఆయనను పూజిస్తారు, ఆయన వైపు ఆకర్షితులవుతారు. హనుమాన్ ఆలయాలను సందర్శించడానికి ప్రయాణించడానికి ఇష్టపడతారు. అలాగే ఏదైనా సమస్యలో వున్నప్పుడు హనుమంతుడి రక్ష వారికి లభిస్తుంది. ఆ రాశుల వారెవరో ఒకసారి చూద్దాం.. 
 
మేష రాశి వారికి కుజ గ్రహం ఆధీనం. హనుమంతుడు మంగళవారం జన్మించాడని పురాణాలు చెప్తున్నాయి. ఆ రోజుకు అధిపతి కుజ గ్రహం. ఈ రాశికి చెందిన వారు హనుమంతుడి పూజకు ఎక్కువగా ఇష్టపడతారు. ఇంకా ఈ రాశి వారికి కుజ గ్రహాధిపతి అయిన హనుమంతుడి అనుగ్రహం లభిస్తుంది.
 
కుంభ రాశి వారికి అధిపతి శని గ్రహం. ఈ రాశి వారు అత్యంత దాతృత్వ గుణం కలిగి ఉంటారు. తమ ప్రియమైన వారి పట్ల అంకితభావంతో ఉంటారు కాబట్టి, వారు హనుమంతుని అనుగ్రహాన్ని పొందుతారు.
 
శని గ్రహానికి హనుమంతునితో కూడా గాఢమైన సంబంధం ఉంది. ఈ రాశిలో జన్మించిన జాతకులు భక్తిశ్రద్ధలతో హనుమంతుడిని పూజిస్తే, ఆ స్వామి వారికి ఆనందం, సంపద  శక్తిని ప్రసాదిస్తారని నమ్ముతారు. ఇంకా వారిని ప్రతి సమస్య నుండి రక్షించి, వారి ఈతి బాధలను తొలగిస్తాడు.
 
పరిహారం: ఈ వ్యక్తులు ప్రతి మంగళవారం, శనివారం హనుమాన్ ఆలయాన్ని సందర్శించి సుందరకాండను పఠించాలి.
 
సింహరాశి వారికి అధిపతి సూర్య గ్రహం. ఇక సూర్యుని గురించి మాట్లాడుకుంటే, సూర్యుడిని హనుమంతుని గురువుగా భావిస్తారు. ఈ రాశిలో జన్మించిన జాతకులు సహజంగానే హనుమంతుని ఆశీస్సులు పొందుతారు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
10-04-2026 శుక్రవారం ఫలితాలు- వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు..