1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
  4. Auspicious results for those 5 zodiac signs from October with the arrival of Lord Shani

శని దేవుడు రాకతో అక్టోబరు నుంచి ఆ 5 రాశుల వారికి శుభ ఫలితాలు

Shani
అక్టోబరు నెలలో శని దేవుడు తన సొంత నక్షత్రమైన ఉత్తరాభాద్రలోకి ప్రవేశిస్తున్నాడు. శని వచ్చే నెల అక్టోబరు 9 నుంచి ఉత్తరాభాద్రలోకి ప్రవేశిస్తున్నాడు. శనీశ్వరుడు వచ్చే ఏడాది ఫిబ్రవరి 8 వరకూ అక్కడే వుంటాడు. దీనితో ప్రత్యేకించి 5 రాశుల వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆ రాశులు ఏమిటి, వారికి కలిగే ఫలితాలు ఏమిటో తెలుసుకుందాము.
 
శని గ్రహ నక్షత్ర మార్పుతో మేష రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యక్తిగత పనులు నెరవేరడమే కాకుండా పెండింగులో వున్నవి పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నవారికి ఫలితం వుంటుంది. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు.
 
ఇక శని సంచారంతో మిధున రాశి వారికి కూడా కలిసి వస్తుంది. కొత్త అవకాశాలు వస్తాయి. అదనపు బాధ్యతలు స్వీకరిస్తారు. మీ పనితీరుకు ప్రశంసలు దక్కుతాయి. ఆదాయం పెరిగి ఆర్థికంగా నిలదొక్కుకుంటారు.
 
కన్యా రాశి వారికి శని సంచారంతో అనేక శుభ ఫలితాలు కనబడుతున్నాయి. కుటుంబ జీవితం సంతోషంగా వుంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి బైటపడతారు. గతంలో తీసుకున్న నిర్ణయాలు ఇక ఫలప్రదం అయ్యే రోజులు వచ్చాయని గుర్తుంచుకోండి.
 
మకర రాశి వారికి కూడా శుభ ఫలితాలు కనబడుతున్నాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు బలపడతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు లభిస్తాయి. విద్యార్థులకు కెరీర్ పరంగా మంచి మంచి అవకాశాలు వస్తాయి.
 
కుంభరాశి వారు కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటారు. పాత పరిచయాల ద్వారా మేలు జరుగుతుంది. ఆధ్యాత్మిక రంగాలపై ఆసక్తి పెరుగుతుంది.
 
గమనించాల్సిన విషయం... పైన తెలిపినవి జ్యోతిష శాస్త్రం, పండితులు, వివిధ శాస్త్రాలను అనుసరించి ఇవ్వబడ్డాయి.
 
About Writer
జయ
Content provider.... మరింత చదవండి
తర్వాతి కథనం
30-09-2026: సెప్టెంబర్ నెల చివరి రోజు మీ రాశి ఫలాలు ఎలా వున్నాయంటే?