మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. »
  3. భవిష్యవాణి
  4. »
  5. పంచాంగం
Written By Selvi
Last Updated : శనివారం, 31 మే 2014 (13:01 IST)

చిత్తా నక్షత్రం పుట్టారా? అయితే ఆవేశపరులే!

చిత్తా నక్షత్రంలో జన్మించిన మహిళలు శాంతంగా ఉంటారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. మెరిసే సౌందర్యాన్ని కలిగివుండే ఈ జాతకులు, ఇతరులను ఇట్టే ఆకట్టుకుంటారు. కానీ భాగస్వామి విషయంలో మాత్రం ఈ జాతకులకు కొన్నిసమస్యలు తలెత్తే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
 
ఇంకా ఈ నక్షత్రంలో పుట్టిన మహిళలు కారణాలు లేకుండా ఆవేశానికి గురవుతారు. ఇతరులు తప్పు చేస్తే వారు ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా ప్రశ్నించడానికి ఏమాత్రం వెనుకాడరు. అలాగే చిత్తా నక్షత్రంలో పుట్టిన మహిళా జాతకులు మధ్య వయస్సు వరకు సుఖభోగాలను అనుభవిస్తారు. ఆ తర్వాత ఈ జాతకులకు మితమైన భోగభాగ్యాలు చేకూరుతాయి. 
 
చిత్త నక్షత్రం మొదటి పాద ఫలాలు: 
సన్నని శరీరంతో దర్శనమిచ్చే వీరు వ్యాధుల బారినపడి కొన్ని సమస్యలకు గురవుతారు. కొన్ని సమస్యల వలన మనస్సు కలత చెందటం వంటివి తటస్థిస్తాయి. సామాన్యమైన ఐశ్వర్యంగల కుటుంబంలో వీరికి పెళ్లి కుదురుతుంది. దూరప్రయాణాలు చేయటం వంటి వాటిలో ఆసక్తిని కలిగియుంటారు. ఇంకా సుఖసంతోషాలతో ఈ జాతకులు జీవితం గడుపుతారు. 
 
రెండవ పాదం: చిత్త నక్షత్ర రెండవ పాదంలో జన్మించిన స్త్రీలు అందంగా ఉండటంతో పాటు భయపడే స్వభావాన్ని కలిగియుంటారు. 
ఎక్కడికి వెళ్లినా మరొకరి సహాయాన్ని అర్ధిస్తారు. భాగస్వాముల చేత కొద్దిపాటి సంతోషాన్ని అనుభవిస్తారు. అధిక యోగాలకు పరిమితం కాకపోయిన మితమైన భోగాలను అనుభవిస్తారు.
 
మూడో పాదం: 
ఇతరులను ఆకట్టుకునే అందాన్ని కలిగి వుండే ఈ జాతకులు విద్యారంగంలో రాణిస్తారు. వీరికి స్నేహితులు ఎక్కువ. ఎలాంటి సమస్యనైనా సునాయాసంగా పరిష్కరిస్తారు. అందరిని వాక్చాతుర్యతతో ఆకర్షిస్తారు. నిజాయితీకి ప్రాముఖ్యతనిస్తారు. గౌరవంగా జీవించాలని ఆశిస్తారు.
 
నాల్గో పాదం: బుద్ధి కుశలతతో వ్యవహరిస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలతో జీవిస్తారు. విరోధులకు దగ్గరై వారి తప్పు, ఒప్పులను గురించి ఎత్తిచూపి వారిని మంచి మార్గంలో నడిపించటానికి కృషిచేసి విజయం సాధిస్తారు. ఇతరుల వద్ద కీర్తీ ప్రతిష్టలను సంపాదిస్తారు. సుఖమైన భోగాలను అనుభవిస్తారు. జీవితంలో ఎలాంటి సమస్యలు వీరి దరికి చేరవని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.