1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
  4. Guru Pushya Yog 2026: Guru pushya yoga astrological importance benefits of lakshmi puja

Guru Pushya Yog 2026: గురు పుష్య యోగం.. కర్కాటక రాశికి లాభం... పూజ ఎలా చేయాలంటే?

Guru Pushya Yogam
Guru Pushya Yogam
గురు పుష్య యోగంను పురస్కరించుకుని గురు భగవానుడికి ప్రత్యేక పూజలు వివిధ ఆలయాల్లో జరుగుతున్నాయి. గురువారం రోజున పుష్యమి నక్షత్రం కలిసి రావడాన్ని గురు పుష్యమి యోగంఅంటారు. జ్యోతిష్య శాస్త్రంలో దీనిని అత్యంత పవిత్రమైన, శక్తివంతమైన అమృత ఘడియలుగా భావిస్తారు. 
 
2026 జూన్ 18న కర్కాటక రాశిలో చంద్రుడు, ఉచ్చ స్థితిలో గురుడు కలవడం వల్ల 12 ఏళ్లకు ఒకసారి వచ్చే అరుదైన యోగంగా మారింది. ఈ రోజున శ్రీ లక్ష్మీ నారాయణుల అనుగ్రహం కోసం చేసే పూజలు, కొనుగోళ్లు అఖండ ఐశ్వర్యాన్ని ఇస్తాయి. ఈ రోజున లక్ష్మీపూజ చేసేవారికి.. నారాయణునిని స్మరించే వారికి సకల సంపదలు చేకూరుతాయి. గురు పుష్యమి యోగమైన ఈ పవిత్రమైన రోజున బంగారం, వెండి ఆభరణాలు, భూములు లేదా స్థిరాస్తులు, కొత్త వాహనాలు, ఇలెక్ట్రానిక్ వస్తువులు, వ్యవసాయ పరికరాలు కొనుగోలు చేయడం శుభప్రదం. 
 
ఇంకా శనగలు దానం చేయడం వల్ల గురు దోషాలు తొలగుతాయి. వీటితో పాటు పసుపు, కుంకుమ, పాలు, బెల్లం, అరటిపండ్లు, పుస్తకాలు, అన్నదానం చేయడం విశేష ఫలదాయకంగా చెప్తారు. లక్ష్మీదేవిని తులసి దళాలతో పూజించి, విష్ణు సహస్రనామం పఠించాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 
 
గురుపుష్య యోగ రాశి ఫలితాలు 
మేష రాశి : ఆర్థికంగా చాలా అనుకూలమైన సమయం. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి అవుతాయి. నారాయణ స్వామిని పూజించడం విశేష ఫలితాలను ఇస్తుంది. 
 
వృషభ రాశి : వ్యాపారస్తులకు అద్భుతమైన లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. లక్ష్మీదేవి పూజ అనుకూలిస్తుంది. 
 
మిథునరాశి : ఉద్యోగస్తులకు ప్రమోషన్ లేదా జీతాల పెంపు వంటి సానుకూల వార్తలు అందుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ రోజు ఏదైనా కొత్త కోర్సు లేదా వ్యాపార పెట్టుబడులు పెట్టడానికి అనుకూలం.
 
కర్కాటక రాశి: గురు పుష్య యోగం వల్ల కర్కాటక రాశి వారికి విశేషమైన అదృష్టం వరిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. గురుభగవానుడి ఆరాధనతో ఎంతో మేలు జరుగుతుంది. పసుపు రంగు వస్తువులను దానం చేయడం మంచిది.
 
సింహ రాశి: ఆర్థిక ఇబ్బందుల నుండి ఉపశమనం లభిస్తుంది. కోర్టు కేసులు లేదా భూవివాదాలు మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. కొత్త ఇల్లు లేదా స్థలం కొనడానికి అగ్రిమెంట్ చేసుకోవడానికి ఇది సరైన రోజు.
 
కన్యా రాశి : ఉద్యోగ మార్పు కోసం చూస్తున్న వారికి మంచి ఆఫర్లు వస్తాయి. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం లభిస్తుంది. శ్రీ మహావిష్ణువుకు పసుపు రంగు పూలతో పూజ చేయడం వల్ల శుభం కలుగుతుంది.
 
తులా రాశి: ఖర్చులు పెరిగే అవకాశం ఉంది, కాబట్టి ఆర్థిక విషయాల్లో కాస్త జాగ్రత్త అవసరం. అయితే, వ్యాపార విస్తరణకు పెట్టుబడులు పెట్టవచ్చు. లక్ష్మీ అష్టోత్తరం పఠించడం వల్ల ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది.
 
వృశ్చిక రాశి: అదృష్టం మీ వైపు ఉంటుంది. పాత మిత్రుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. సంతాన పరంగా మంచి వార్తలు వింటారు. ఈ రోజున వెండి వస్తువులు లేదా పూజా సామాగ్రి కొనడం శుభప్రదం.
 
ధనుస్సు రాశి: మీ రాశ్యాధిపతి అయిన గురుడి అనుగ్రహం వల్ల పెండింగ్ పనులన్నీ చకచకా సాగిపోతాయి. సమాజంలో కీలక బాధ్యతలు లభిస్తాయి. గురు చరిత పారాయణం చేయడం లేదా గుడిలో శనగలు దానం చేయడం వల్ల మేలు జరుగుతుంది.
 
మకర రాశి: శ్రమకు తగిన ఫలితం ఆలస్యంగానైనా దక్కుతుంది. కుటుంబ సభ్యులతో చిన్నపాటి విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి, కాబట్టి మాటపై నియంత్రణ అవసరం. పేదలకు అన్నదానం చేయడం వల్ల నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది.
 
కుంభ రాశి: కొత్త పరిచయాలు వ్యాపార పరంగా లాభాలను తెచ్చిపెడతాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడానికి ఇది ఉత్తమ సమయం. చిట్కా: వ్యాపార ప్రదేశంలో లేదా ఇంట్లో లక్ష్మీ యంత్రాన్ని ప్రతిష్టించుకోవచ్చు.
 
మీన రాశి : మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఉద్యోగంలో పైఅధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. కుటుంబంలో శుభకార్యాల ప్లానింగ్ జరుగుతుంది. నుదుటున కుంకుమ లేదా పసుపు తిలకం ధరించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి