శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Selvi
Last Updated : మంగళవారం, 8 జులై 2014 (19:00 IST)

కాలసర్పదోష పరిహారానికి కాలభైరవుడిని పూజించండి!

కాలసర్పదోష పరిహారానికి అందరూ శ్రీ కాళహస్తీశ్వరాలయంలో రాహు-కేతువుల పూజ చేయించడం పరిపాటి. అయితే ఈ సర్పదోషం ఉన్న జాతకులు కాలభైరవ మూర్తిని ప్రార్థించడం శ్రేయస్కరం. 
 
అంతేగాకుండా తమిళనాడు రాష్ట్రం, శివగంగై జిల్లా, తిరుప్పత్తూరులోని కాలభైరవ దేవాలయంలో పూజ చేయించినట్లైతే కాలసర్పదోషం తొలగిపోతుందని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఆలయంలో భైరవమూర్తి శునకముతో గాకుండా యోగాసీనుడై భక్తులకు దర్శనమివ్వడం ద్వారా కాలసర్పదోషాన్ని తొలగిస్తాడని పురోహితులు చెబుతున్నారు.
 
ఇంకా కాలసర్పదోషమున్న జాతకులు కులదైవాన్ని పూజించడం, మానసిక బాధితులకు సహాయం చేయడం ద్వారా కొంత శుభ ఫలితాలను పొందవచ్చునని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.