శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Selvi
Last Updated : గురువారం, 12 జూన్ 2014 (17:34 IST)

మీది కృత్తికా నక్షత్రమా? ఐతే ఇలా వుంటారు.!

రవిగ్రహ నక్షత్రమైన కృత్తికలో జన్మించిన జాతకులు అన్య భాషల యందు నేర్పరితనము కలిగివుంటారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఉన్నత విద్యను అభ్యసించి.. ఇతరులకు సలహాలిచ్చే ఈ జాతకులు అవమానాన్ని ఏ మాత్రం సహించలేరు. అన్ని రంగాల్లో ఆధిక్యతతో దూసుకెళ్లాలని తీవ్రంగా శ్రమించే వీరికి మంచి ఫలితం దక్కుతుంది.
 
ఇంకా వైద్య విద్యలో రాణించే కృత్తిక నక్షత్ర జాతకులు.. విశేషమైన పోటీ తత్వముతో ఇతరులను జయించి, ఉన్నత పదవులను అలంకరిస్తారు. అపాత్రదానం, పరిశుభ్రతకు ప్రాధాన్యమిచ్చే ఈ జాతకులు సందర్భాన్ని బట్టి అభిప్రాయాన్ని మార్చుకుంటారు. అయితే చిన్న చిన్న విషయాలకే అసత్యాలు పలకడం వీరి మనస్తత్వమని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. 
 
కృత్తికా నక్షత్రంలో ఏ పాదములో పుట్టిన జాతకులైనా బాల్యంలో ధనిక జీవితాన్ని గడిపి, ఆపై స్థిరాస్తులను క్రమంగా కోల్పోతారు. క్రమశిక్షణకు ఎక్కువ ప్రాధాన్యత నిచ్చే ఈ జాతకులు ఆస్తులను స్వశక్తితో సంపాదించుకుంటారు. 
 
సంతానాన్ని సమదృష్టిలో చూసే వీరికి భాగస్వామి నుంచి అన్ని విధాలా సహకారం అందుతుంది. ఇతరుల సలహాలను లెక్కచేయకుండా స్వశక్తితో ఉన్నత స్థాయికి ఎదిగే ఈ జాతకులు జీవితంలో ఇతరులకు మార్గదర్శకంగా నిలుస్తారు. స్నేహానికి ప్రాణం ఇవ్వడం, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం వీరి నైజం.
 
ఇకపోతే.. కృత్తికా నక్షత్రంలో పుట్టిన జాతకులకు శని మరియు బుధవారాలు అన్ని విధాలా అనుకూలిస్తాయి. అయితే పౌర్ణమి రోజున ఎలాంటి శుభకార్యాన్ని ప్రారంభించడం మంచిది కాదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అలాగే నీలపు రంగు వీరికి శుభ ఫలితాలనిస్తుంది. నీలం రంగును ధరించడం ద్వారా ఈ జాతకులకు మనశ్శాంతి లభిస్తుంది. ఇంకా తెలుపు రంగు చేతి రుమాలును వాడటం ద్వారా శుభఫలితాలుంటాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. 
 
ఇక అదృష్ట సంఖ్యల విషయానికొస్తే.. ఆరు అనే సంఖ్య కృత్తికా నక్షత్రంలో పుట్టిన వారికి అన్ని విధాలా అనుకూలిస్తుంది. ఇంకా 4, 5, 8 అనే సంఖ్యలు ద్వారా వీరికి శుభఫలితాలను చేకూరుతాయి.