బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : సోమవారం, 17 మే 2021 (15:07 IST)

ఒత్తిడి మాయం కావాలంటే.. శివునికి పాలాభిషేకం..?

మానసిక ఒత్తిడితో పోరాడుతుంటే, చక్కెరతో కలిపిన పాలతో సోమవారం లేదంటే మంగళవారం శివునికి అభిషేకం చేయండి. ఇలా చేయడం ద్వారా ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది. అలాగే మనఃకారకుడైన చంద్రుడిని పౌర్ణమి రోజున చంద్రునికి పూజ చేయడం ద్వారా ఒత్తిడి నుంచి తప్పుకోవచ్చు. 
 
చంద్ర గ్రహం యొక్క అనుకూలమైన ప్రభావాన్ని పొందడానికి, పాలు, పాల ఉత్పత్తులు, బియ్యం, తెలుపు నువ్వులు, చక్కెర, బర్భీ వంటి స్వీట్లు మొదలైన అన్ని రకాల తెల్ల ఆహార పద్ధతులను నైవేద్యంగా సమర్పించాలి. ఇంకా పౌర్ణమి రోజున శివుని జలాభిషేకం చేయాలి.
 
తెల్ల ఆవుకు సోమవారం రొట్టె, బెల్లం తినిపించడం వల్ల మన కష్టాలన్నీ తొలగిపోతాయి. పాలు, పెరుగు, తెలుపు వస్త్రం, చక్కెర మొదలైన తెల్లని వస్తువులను సోమవారం దానం చేస్తే కూడా ప్రయోజనం ఉంటుంది. అలాగే కొలను, చెరువుల్లోని చేపలకు పిండిని ఇవ్వడం ద్వారా, వాటిని తినిపించడం వల్ల సంపద, కీర్తి లభిస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.