సంబంధిత వార్తలు
- మూడేళ్లకు ఒకసారి వచ్చే పద్మిని ఏకాదశి.. తులసి దళాలతో అర్చన చేస్తే?
- అమావాస్య రోజున శని జయంతి- ఏకకాలంలో అదృష్ట యోగాలు.. ఈ రాశుల వారికి?
- Sri Narasimha Jayanti: నృసింహ జయంతి: పానకం, వడపప్పు... ఈ మంత్రాలతో పూజిస్తే..?
- మంగళవారం నాడు ప్రదోషం వస్తే.. భౌమ ప్రదోషం.. శివపూజ చేస్తే?
- వైశాఖ మాసం.. అష్టమి రోజున కాలభైరవ పూజ చేస్తే.. కుంకుమ దానంతో...?
మృగశిర కార్తె అంటే ఏంటి విశేషం.. ఇంద్రుడు ఎంత వైభోగంగా ఉంటాడో..?
Mrigasira Karthi 2026
మృగశిర కార్తె రాక రైతులకు నిజమైన పండుగ లాంటిది. వర్షాల ఆశతో అన్నదాతలు తమ పొలాల వైపు అడుగులు వేస్తారు. అందుకే ఈ కాలాన్ని ఏరువాక కాలం అని పిలుస్తారు. నాగలిని, ఎడ్లను పూజించి తొలి దుక్కి దున్నడం ఈ కార్తెలోనే విశేషం. జ్యోతిష్య శాస్త్రం, తెలుగు పంచాంగం ప్రకారం సూర్యుడు రోహిణి నక్షత్రం నుండి మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించడంతో ఈ కార్తె ప్రారంభమవుతుంది.
నైరుతి రుతుపవనాల రాకతో చల్లని గాలులు వీస్తూ, తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడా మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయి. ఎండకు ఎండిపోయిన చెరువులు, కుంటలు, వాగులు మృగశిర వర్షాలతో మళ్లీ జలకళను సంతరించుకుని కొత్త నీటితో నిండుతాయి.
ఆధ్యాత్మిక కోణంలో చూస్తే, వర్షాలు పడకుండా అడ్డుపడిన వృతాసురుడిని అంటే మృగాసురుడిని సంహరించి, భూమిపై తొలకరి జల్లులు కురిపించిన వర్షదేవుడు... ఇంద్రుని విజయానికి సంకేతం ఈ మృగశిర కార్తె. తూర్పు ఆకాశంలో ఇంద్ర నక్షత్రం ఉదయించగానే, సూర్యుడు మృగశిరలోకి ప్రవేశిస్తాడు. ఇది రుతుపవనాల రాకకు, సకాలంలో వర్షాలు కురవడానికి సంకేతం. ఈ కార్తెలో నియమాలను ఎవరైతే పాటిస్తారో వారికి ఇంద్రయోగం లభిస్తుంది.
అంటే స్వర్గాధిపతి ఇంద్రుడు ఎంత వైభోగంగా ఉంటాడో భూమిపై నివశించే మనుషులు కూడా అంతే వైభోగంతో జీవించేందుకు అవకాశం లభిస్తుంది. ఈ మృగశిర కార్తె ఈరోజు నుంచి జూన్ 21 వరకు వుంటుంది. 14 రోజులు ఉదయాన్నే లేచి సూర్య నమస్కారాలు చేయడం, ఇంట్లో కర్పూర హారతి లేదా సాంబ్రాణి ధూపం వేయడం వల్ల గాలిలోని సూక్ష్మక్రిములు నశిస్తాయి. ఆరోగ్యంగా వుంటారు.
