సంబంధిత వార్తలు
- ప్రమాదంలో గాయపడిన మహిళా కానిస్టేబుల్ను రక్షించిన బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్
- భవిష్యత్ అమెరికా అధ్యక్ష అభ్యర్థిని కాదు.. ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్ను మాత్రమే : జేడీ వాన్స్
- Eid Al-Adha 2026 date: తెలుగు రాష్ట్రాల్లో మే 28, 2026 గురువారం బక్రీద్.. సెలవు దినం
- కాశ్మీర్ లోయ అందాలు చూద్దామని కేబుల్ కార్ ఎక్కితే గాలిలో వేలాడదీసింది, 300 మంది కేకలు, అరుపులు
- ముగ్గురు ADMK ఎమ్మెల్యేలు రాజీనామా, పావులు కదుపుతున్న విజయ్, అన్నాడీఎంకె అంతమేనా?
మూడేళ్లకు ఒకసారి వచ్చే పద్మిని ఏకాదశి.. తులసి దళాలతో అర్చన చేస్తే?
Lord Vishnu
శ్రీ మహా విష్ణువుకు ప్రీతికరమైన అధిక మాసం అంటే జ్యేష్ఠం కాబట్టి ఈ మాసానికి పురుషోత్తమ మాసమని పేరు వచ్చింది. పద్మిని ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల సమస్త పాపాలు తొలగిపోయి, మోక్షం లభిస్తుందని నమ్ముతారు. ఈ రోజు స్వామిని తులసి దళాలతో, పసుపు రంగు పూలతో, కలువ పూలతో చక్కగా అలంకరించుకోవాలి. ఆవు నేతితో దీపారాధన చేయాలి. అనంతరం శ్రీ మహావిష్ణువు అష్టోత్తర శతనామావళి పఠించాలి.
అలాగే ఈ రోజు తులసి దళాలతో శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ చేయడం శుభప్రదం. పూజ పూర్తయ్యాక కొబ్బరికాయ, అరటిపండ్లు, చక్రపొంగలి వంటి నైవేద్యాలు సమర్పించాలి. సాయంకాలం సంధ్యా సమయంలో సమీపంలోని విష్ణువు ఆలయానికి వెళ్లి తులసి మాల సమర్పించాలి. ఈ రోజు రాత్రంతా నిద్రపోకుండా శ్రీమన్నారాయణుని భజనలు, కీర్తనలతో జాగారం చేయాలి. మరుసటి రోజు ద్వాదశి పారణ చేసుకోవాలి.
భక్తితో ఈ వ్రతాన్ని పాటిస్తే అశ్వమేధ యజ్ఞం చేసినంత పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. పద్మిని ఏకాదశి రోజు ఉపవాసం వ్రతం ఆచరించి శ్రీ మహా విష్ణువును పూజించిన వారు అన్ని రకాల యాగాలు, తపస్సు చేసిన ఫలితాలు పొందుతారని శాస్త్రవచనం. పెళ్లికాని అమ్మాయిలు ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి, పూజ చేయడం వల్ల మంచి భర్త లభిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఇంకా పేదలకు అన్నదానం, దానధర్మాలు చేయడం విశేష పుణ్యాన్ని అందిస్తుంది.
