శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. »
  3. భవిష్యవాణి
  4. »
  5. పంచాంగం
Written By Selvi
Last Updated : గురువారం, 29 మే 2014 (12:16 IST)

ఉత్తర నక్షత్రం మొదటి పాదంలో పుట్టారా? కెంపును ధరించండి!

ఉత్తర నక్షత్రం మొదటి పాదంలో పుట్టిన వారైతే.. వెండితో పొదిగించిన కెంపును ధరించాలని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు. కెంపును ధరించడం ద్వారా ఉన్నత స్థానాలను అలంకరించడం, వ్యాపారాభివృద్ధి చేకూరుతుందని వారు చెబుతున్నారు. 
 
ఇంకా ఉత్తర నక్షత్రంలో పుట్టిన జాతకులు ఆరు సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల వరకు వీరికి చంద్ర మహర్ధశ కావున ముత్యమును వెండితో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించడం మంచిది.
 
అలాగే 16-23 సంవత్సరాల వరకు ఈ జాతకులకు కుజమహర్దశ జరుగుతున్నందువల్ల పగడమును బంగారంతో పొదిగించుకుని ధరించడం ద్వారా సుగుణవతి అయిన భార్య లభిస్తుందని రత్నాల శాస్త్రం చెబుతోంది. పగడమును ధరించడం ద్వారా సుఖసంతోషములు చేకూరుతాయి.
 
ఇకపోతే.. 41-57 సంవత్సరాల మధ్యలో గురు మహర్ధశ నడవంతో ఈ జాతకులు పుష్యరాగమును బంగారముతో పొదిగించుకుని చూపుడు వేలుకు ధరించాలి. ఇంకా 57-76 వయస్సుకు మధ్య శని మహర్ధశ కావడంతో నీలమును వెండితో పొదిగించుకుని మధ్య వేలుకు ధరించడం మంచిది. 
 
అలాగే 76 సంవత్సరాల తర్వాత ఉత్తర నక్షత్రం తొలి పాదంలో పుట్టిన జాతకులకు బుధ మహర్ధశ కావున పచ్చను బంగారుతో పొదిగించి చిటికెన వేలుకు ధరించాలి. 
 
ఇంకా ఈ నక్షత్రములో పుట్టిన జాతకులకు ఈతిభాదలు తొలగిపోవాలంటే ప్రతి శనివారం విష్ణుమూర్తికి నువ్వుల నూనెతో దీపమెలిగించడం మంచిది. ఇలా తొమ్మిది వారాలు చేయడం ద్వారా ఈతిబాధలు, ఆర్థిక సమస్యలు తొలగిపోయి సుఖసంతోషాలు చేకూరుతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.