సంబంధిత వార్తలు
- మేఘాలయ హనీమూన్ హత్య కేసు: నిందితురాలు సోనమ్‌కు బెయిల్
- నాసా అదుర్స్.. 50ఏళ్ల తర్వాత చంద్రుడిపైకి మానవుడు.. ఆర్టెమిస్-II ప్రయోగం (video)
- రాజయోగ సంకష్ట హర చతుర్థి.. కొబ్బరి మాలను సమర్పిస్తే.. శని, రాహు-కేతు దోషాలు..?
- చంద్రోదయంతోనే చంద్రగ్రహణం, ఏ రాశివారికి ఎలాంటి ఫలితాలు?
- శ్రీవారి భక్తులకు అలెర్టు.. రెండు రోజుల పాటు టోకెన్ల జారీ రద్దు..
Vaishakh Purnima 2026: వైశాఖ పౌర్ణమి: చంద్రుడు, శ్రీలక్ష్మి పూజతో సర్వం శుభం
Vaishakh Purnima 2026
జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడిని మనస్సుకు కారకుడిగా భావిస్తారు. జాతకంలో చంద్ర దోషం ఉన్నవారు, తరచుగా మానసిక ఒత్తిడి, ఆందోళనలతో బాధపడేవారికి ఈ పౌర్ణమి ఒక వరం. వైశాఖ పౌర్ణమి రాత్రి నిండు చందమామకు అర్ఘ్యం సమర్పించాలి. ఒక పాత్రలో గంగాజలం లేదా స్వచ్ఛమైన నీరు తీసుకుని, అందులో కొద్దిగా పచ్చి పాలు, విరగని బియ్యపు గింజలు (అక్షతలు) వేసి చంద్రునికి జల సమర్పణ చేయాలి. ఇలా చేయడం ద్వారా చంద్ర దోషాలు తొలగిపోతాయి.
ఈ అర్ఘ్యం ఇస్తున్నప్పుడు ఓం సోం సోమాయ నమః అనే మంత్రాన్ని భక్తితో జపించాలి. దీంతో మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఇంకా ఆర్థిక సమస్యలతో బాధపడేవారు పౌర్ణమి రాత్రి శ్రీ లక్ష్మీదేవిని పూజించాలి. పూజగదిలో గవ్వలను వుంచి పూజించాలి. పౌర్ణమి రోజున లక్ష్మీపూజతో వృధా ఖర్చులు పూర్తిగా తగ్గిపోయి ఆర్థిక స్థిరత్వం లభిస్తుందని ప్రగాఢ విశ్వాసం.
