వామన జయంతి.. పసుపు రంగు పువ్వులు, నెయ్యితో దీపం వెలిగిస్తే?
Vamana Jayanthi
పూజకు పూజా స్థలాన్ని శుభ్రం చేసి పసుపు రంగు పువ్వులు, పసుపు రంగు వస్త్రం, అగరుబత్తులు, నెయ్యితో కూడిన ఇత్తడి లేదా మట్టి దీపం వెలిగించుకోవాలి.
అలాగే నైవేద్యాలుగా పంచామృతం (పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార మిశ్రమం), తులసి ఆకులు, చందనం, కుంకుమను సమర్పించుకోవాలి. ఇంకా వామన జయంతి రోజున పెరుగు అన్నంగా ఇవ్వడం ద్వారా సర్వాభీష్టాలు చేకూరుతాయి. అలాగే బియ్యం, పప్పులు, దుస్తులు గొడుగు, పాదరక్షలు (బ్రాహ్మణునికి దానం చేయడం) మంచిది.
వామన గాయత్రీ మంత్రం:
"ఓం వామనాయ విద్మహే త్రివిక్రమాయ ధీమహి
తన్నో వామనః ప్రచోదయాత్."ను తులసి మాల ఉపయోగించి 108 సార్లు పఠించడం మంచిది.
అలాగే శ్రీమద్ భాగవతం నుండి వామన అవతార కథను చదవడం లేదా వినడం మంచిది. ఆపై నెయ్యి దీపంతో హారతి చేయడం, ఓం జై జగదీష్ హరే అని పాడడం.. ప్రసాదం స్వీకరించడం మరిచిపోకూడదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.
