గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Selvi
Last Updated : సోమవారం, 15 డిశెంబరు 2014 (19:09 IST)

చవితిరోజున ముల్లంగి-అష్టమి రోజున కొబ్బరికాయ తినకూడదట..!

పాడ్యమి రోజున గుమ్మడికాయ, విదియ రోజున వాకుడుకాయ, తదియ రోజున పొట్లకాయ,  చవితి రోజున ముల్లంగి,  అష్టమి రోజున కొబ్బరి కాయ, నవమి రోజున సొరకాయ, దశమి రోజున తీగ బచ్చలి, ద్వాదశి రోజున మాంసము, త్రయోదశి రోజున ములక్కాడలు, చతుర్దశి రోజున మినుములకు సంబంధించిన వంటలను తినరాదని అంటారు.
 
ఈ నియమాన్ని గుర్తుపెట్టుకుంటే ఆయా తిథుల్లో ఆ వంటకాలు చేయకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. వీటికి బదులుగా చేసే వంటకాలను దైవానికి సమర్పించి ఆ తరువాత వాటిని ప్రసాదంగా స్వీకరించవచ్చు. ఆరోగ్యపరమైన విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ నియమాన్ని పాటించడం మంచిదని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు.