మీరు దేనిని గురించి ఆలోచిస్తే అదే విధంగా తయారవుతారు. బలహీనతను గురించి ఆలోచిస్తే బలహీనులుగా తయారవుతారు. బాలాన్ని గురించి ఆలోచిస్తే బలవంతులుగా తయారవుతారు. కానీ బలాన్ని గురించి ఆలోచించాలంటే అందుకు తగినవిధంగా నిరంతరం మనకు బలాన్ని గుర్తుచేస్తూ, ఆ బలానికి చిహ్నమైన ఒక ఆదర్శం మనకు అవసరం. ఒక ఆదర్శాన్ని ఎదురుగా వుంచుకొని దానిని అనుసరించేటపుడు మనం తప్పు చేసేందుకు అవకాశం తక్కువ. ఆ ఆదర్శనం మనకు అందనంత ఎత్తులో, చేరుకోలేనంత దూరంలో ఉండవచ్చుగాక. కానీ దానిని తప్పక పొంది తీరాలని మనం అనుకోవాలి. నిజానికి మనం ఎంచుకునే ఆదర్శం అయివుండాలి. అటువంటి ఆదర్శాన్ని మాత్రమే వ్యక్తులు. సమాజం తమ ముందు వుంచుకోవాలి.