ప్రస్తుతం మహిళలపట్ల అత్యాచారాలు, అరాచకాలు, యాసిడ్ దాడులు తదితరాలు విపరీతంగా జరుగుతున్నాయి. దీంతో కొన్ని సూచనలు పాటిస్తే మిమ్మల్ని మీరు కాపాడుకునేందుకు మార్గం సుగమం అవుతుంది. పగలు కావచ్చు లేదా రాత్రి కావచ్చు. ఇంట్లో కావచ్చు లేదా బయట దారిలో కావచ్చు మిమ్మల్ని మీరు కాపాడుకునేందుకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడైనాకూడా మీపై దొంగలు, దోపిడీదారులు దాడి చేస్తే మిమ్మల్ని కాపాడుకునే విధంగా దేవాలయాలకు వెళ్ళేటప్పుడు, బజారులోకాని లేదా ఏదైనా వివాహమహోత్సవాల్లో మహిళలనుంచి చైన్లను దొంగలించే సంఘటనలు చాలానే వింటూఉంటాం. ఇలాంటి సమయంలో మీరు కొన్ని విషయాలను దృష్టిలో పెట్టుకుంటే మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు.