మీకు డ్రెస్సింగ్ సెన్స్ ఉందా.. నలుగురిలో హుందాగా మీరు డ్రెస్ చేస్తున్నారా.. ఒకవేళ మీకు డ్రెస్సింగ్ సెన్స్ లేకపోతే.. డ్రెస్ చేయడంలో కన్‌ఫ్యూజన్ ఉంటే ఈ కథనం చదవాల్సిందే. నలుగురు మనల్ని చూసేటప్పుడు ఇతరులకు మనపై మంచి అభిప్రాయం కలిగేలా దుస్తులు ధరించాలి. దీన్నే డ్రెస్సింగ్ సెన్స్ అంటారు. జనరల్ నాలెడ్జ్‌ను ఎలా పెంపొందించుకుంటున్నామో అదేవిధంగా డ్రెస్సింగ్ సెన్స్ కూడా క్రమేణా మెరుగవుతూ వుండాలి.