దేవుని దగ్గర అది ఇవ్వు, ఇది ఇవ్వు అని కోరుతారు. ఇదేనా భక్తి. మన చుట్టూ ఉన్నవారు దేవుని సృష్టే, జీవించివున్న పక్కవారిని అసహ్యించుకుంటున్నారు. వారి మరణానంతరం వారి సమాధులపై కవితలు రాస్తున్నారు. సృష్టిని అసహ్యించుకుని, సృష్టించేవాడిపై మాత్రం భక్తి వుందనడం ఆయనని అవమానపరచడం లాంటింది. ఆ భక్తిని ఆయనెలా చూడగలడు. మీ ప్రతీ శ్వాసలోను, ప్రతి పనిలోనూ ప్రేమ ఉండాలి. అప్పుడే ఆ ప్రేమ తనంతట తానుగా మిమ్ముల్ని భగవంతుని వద్దకు చేరుస్తుంది.