కార్తీక మాసంలో తులసి మొక్కను నాటుతున్నారా?
కార్తీక మాసంలో తులసి పూజకు ఎంతో ప్రాధాన్యత వుంది. ఐతే తులసి మొక్కను నాటేటప్పుడు పాటించాల్సిన నియమాలు కొన్ని వున్నాయి. కార్తీక మాసంలో తులసి మొక్కను నాటాలనుకుంటే, వాస్తు, ఆధ్యాత్మిక నియమాలను పాటించడం మంచిది. నాటడానికి శుభ దినం గురువారం లేదా శుక్రవారం మంచిది. కార్తీక మాసంలోని శుక్ల పక్ష తిథులలో నాటడం అత్యంత శుభకరం.
వాస్తు ప్రకారం తులసి మొక్కను ఇంటి ఉత్తర, ఈశాన్యం లేదా తూర్పు దిశలలో ఉంచడం శ్రేయస్కరం. తులసి మొక్కను దక్షిణ దిశలో ఎప్పుడూ ఉంచకూడదు. ఇంటి ముందు భాగంలో, బహిరంగ ప్రదేశంలో, నేరుగా నేలపై లేదా ప్రత్యేకంగా నిర్మించిన తులసి కోటలో నాటాలి.