గురువారం, 28 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By PNR
Last Updated : సోమవారం, 4 ఆగస్టు 2014 (17:30 IST)

పరిపూర్ణతత్వమంటే?

పరిపూర్ణతకు చేరటమంటే తనను తాను స్వచ్ఛమైన మనస్సుతో తరచి చూసుకుని, తాను ఉన్న స్థితి ఎటువంటిదైనా దానిని అనందంగా అంగీకరించటం. సాధారణ స్పర్శాంగాలకు అందని ఆ అనుభవం అందుకోవాలంటే ఆధ్యాత్మిక ఆనందస్థితికి చేరాలి. 
 
సత్యమార్గం తప్పక పయనించేవారికి తాము కొత్తగా అందుకోవాలిసినదేదీ లేదని, ఆత్మానందాన్ని మించినది దొరకదని అర్థమవుతుంది. ఆ స్థిరత్వం వచ్చిన వారు ఎటువంటి కష్టాలు ఎదురైనా చలించరు. భౌతిక సుఖాలను అంటిపెట్టుకుని ఉండేవారికి పలు రకాల కష్టాలు కలుగుతాయి. అంటువంటి కష్టాల నుండి విముక్తి పొంది అద్భుతమైన ఆనంద స్థితికి చేరేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.