శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By PNR
Last Updated : మంగళవారం, 12 ఆగస్టు 2014 (17:37 IST)

నీలి రంగు పువ్వులతో "శనివ్రతం" చేయండి!

శనివారం రోజున శనివ్రతం ఆచరించే వారికి ఈతిబాధలు తొలగిపోయి, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని వేదపండితులు చెపుతుంటారు. అష్టమి వ్రతాల్లో ప్రసిద్ధి చెందిన శనివత్రాన్ని ఆచరించడం చాలా సులభం. శనివారం సూర్యోదయానికి ముందే లేచి, శుచిగా స్నానమాచరించాలి. 
 
పూజగదిని, పటాలను శుభ్రం చేసుకుని పసుపుకుంకుమ, పువ్వులతో అలంకరించుకోవాలి. ఆ తర్వాత పూజ ప్రారంభించే ముందు విఘ్నేశ్వరుని స్తుతించాలి. తర్వాత పూవులు, అక్షింతలతో శివపార్వతుల విగ్రహానికో లేదా, పటానికో అర్పించి, శివాష్టోత్తరం, గౌరీ లేదా ఉమాష్టోత్తరం చదువుతూ పూజ చేస్తే పుణ్య ఫలాలు సిద్ధిస్తాయి. 
 
శుద్ధాష్టమి, శనివారం, కృత్తికా నక్షత్రం చేయదగ్గ ఈ వ్రతానికి తగిన ప్రతిఫలం దక్కుతుందని పండితులు అంటున్నారు. శనీశ్వరుని శాంతి అనుగ్రహమే కాకుండా, కృత్తికా నక్షత్రాధిపతి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కూడా ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా పొందవచ్చునని వారు చెబుతున్నారు. ఇకపోతే... శనివారం ఆచరించే ఈ శనివ్రతం చివరిన, నీలం రంగు పువ్వులతో శనీశ్వరాష్టోత్తరం స్తుతించడం ద్వారా సుఖసంతోషాలు చేకూరుతాయని విశ్వాసం.