గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 14 డిశెంబరు 2015 (19:08 IST)

శ్రీకృష్ణుడు పాండవులకు చెప్పిన అనంత పద్మనాభ వత్రం గురించి తెలుసా?

పాండవులు వనవాస సమయంలో తాము ఎదుర్కొంటున్న కష్టాల్ని ఎదుర్కుంటున్నప్పటికీ తమ బాధలు తీరే మార్గాన్ని సూచించాల్సిందిగా.. పాండవుల్లో ఒకరైన ధర్మరాజు శ్రీకృష్ణుడుని కోరతాడు. అప్పుడు శ్రీ కృష్ణుడు.. అనంత పద్మనాభ వ్రతాన్ని ఆచరించాల్సిందిగా సెలవిస్తాడు. ఈ వ్రత మహాత్మ్యాన్ని గురించి వివరిస్తాడు. వ్రతాలలో విశిష్టమైన వ్రతంగా చెప్పబడే అనంతపద్మనాభ వ్రతాన్ని దేవతలు, మహర్షులు ఆచరించినట్లు పురాణాలు చెప్తున్నాయి. 
 
అనేక రూపాలు, పేర్లు కలిగి అనంతమైన కాలానికి ప్రతీక అయిన తనని (శ్రీకృష్ణుడిని) ఆదిశేషుడి రూపంలో ఆరాధించమని చెబుతాడు. ఒక కలశంలోకి జలాన్ని తీసుకుని అందులోకి యమునను ఆవాహన చేసి .. ఏడు పడగలతో ఆదిశేషుడి రూపాన్ని దర్భాలతో తయారుచేసుకుని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించాలి.
 
చేతికి 14 ముడులు గల తోరమును ధరించి, 14 రకాల పండ్లు, ఇష్టమైన 14 రకాల పదార్థాలను స్వామిని నివేదన ఇవ్వాలి. ఇలా ఈ వ్రతాన్ని 14 సంవత్సరాల పాటు ఆచరించి.. ఆ తరువాత ఉద్యాపన చేయడం నియమంగా కనిపిస్తుంది. ఈ తోరము ఒక రక్షా కంకణంలా కాపాడుతూ ఉంటుందనీ. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఈతిబాధలు, కష్టాలు తొలగిపోయి, సుఖశాంతులు కలుగుతాయని పండితులు అంటున్నారు.