సాయిబాబా తన భక్తులు దైనందిన జీవితంలో పాటించాలని బోధించిన 4 ముఖ్య సూత్రాలు ఏవి?
షిర్డీ సాయిబాబు భక్తులకు నాలుగు ముఖ్యమైన సూత్రాలను చెప్పారు. అవేమిటంటే...
1. కోరికలన్నీ విడిచి దైవం మీద మనసు నిలపడం.
2. పని చేస్తూనే భగవన్నామ స్మరణ చేయడం.
3. ఎవరి సేవనూ ఉచితంగా తీసుకోకపోవడం.
4. ఏ పని చేసినా దానిని సంపూర్ణంగా, కారుణ్యంతో చేయడం.
మామిడి చెట్టుకు పూత చాలా వస్తుంది కానీ, గాలికి రాలిపోగా కొన్ని మాత్రమే కాయలుగా మారుతాయి. అలాగే బాబా వద్దకు వచ్చే భక్తులలో తీవ్రమైన సాధన, వివేక వైరాగ్యాలు ఉన్నవారు మాత్రమే ఆధ్యాత్మిక ఫలితాన్ని పొందుతారు.
