ఆత్మలు తిరుగాడే మన్ఫూర్ ఘాట్...

Bhairavnath
WD PhotoWD
ఏది నిజం శీర్షికలో భాగంగా ఈ వారం మేం మన్ఫూర్ ఘాట్ -కొండ రోడ్డు- గురించి పరిచయం చేస్తున్నాము. ఆగ్రా-ముంబై మార్గం గుండా మహారాష్ట్రను మధ్యప్రదేశ్‌తో కలిపే ఈ ఘాట్‌ను శాపాలఘాట్‌గా జనం నమ్ముతున్నారు. ఈ ఘాట్‌ మార్గంలో వెళ్లే ప్రజలు చెప్పేదాని ప్రకారం, బతికి ఉన్నప్పుడు కోరికలు తీరని వారి ఆత్మలు కొన్ని ఈ ఘాట్‌లో తిరుగుతూ ప్రమాదాలను సృష్టిస్తున్నాయట. ఈ పుక్కిటి పురాణం మా దృష్టికి రాగానే మేం ఈ మన్ఫూర్ కొండ మార్గం వైపు బయలుదేరాము.

అక్కడికి చేరాక చూస్తే ఈ ఘాట్‌లు బాగా వంపు తిరుగుతూ ప్రమాద భరితంగా ఉంటున్నాయని మాకు తెలిసింది. ఈ ఘాట్ పొడవునా ఇలాంటి వంపులు ఉన్నాయట. కొద్ది దూరం పోయాక భైరవదేవుడి ఆలయానికి చేరుకున్నాము. ఈ రోడ్ మార్గంలో పోతున్నప్పుడు చాలామంది ఈ ఆలయం ముందు తమ తలలు వంచి నమస్కరిస్తూ పోవడం గమనించాము.

ఆ దారిలో పోతున్న ట్రక్కు డ్రైవర్ పప్పు మాలవీయతో మాట్లాడాము. ఈ మార్గంలో చాలా సంవత్సరాలనుంచి తాను డ్రైవింగ్ చేస్తున్నానని అతడు మాకు చెప్పాడు. అతని మాటలను బట్టి ఈ ప్రాంతంలో చాలా ఘాట్‌లు ఉన్నాయని కోరికలు తీరని ఆత్మలు ఈ దారుల్లో తిరుగుతుంటాయని మాకు తెలిసింది. అయితే భైరవ దేవుడి ఆశీర్వాదాలను తీసుకుని వెళితే ఎవరికీ గాయాలు తగలవని మాలవీయ చెప్పాడు. ప్రమాదాల గురించి హెచ్చరిస్తూ పలు ప్రభుత్వ సైన్‌బోర్డులు అక్కడ కనిపించాయి. డ్రైవర్లు తమ బ్రేకులను తనిఖీ చేసుకోవాలని, ఘాట్ మార్గంలో పోతున్నప్పుడు జాగ్రత్తగా బండి నడపాలని ఇవి సూచిస్తున్నాయి.
Lorry accident
WD


అయితే ఈ రోడ్‌పై వాహనాలను నడుపుతున్నప్పుడు చాలామంది డ్రైవర్లు వేగం గురించి పట్టించుకోకపోవడాన్ని మేం గమనించాము. మరో భక్తుడు భైరు మరియు ట్రక్కు డ్రైవర్ విష్ణు ప్రసాద్ గోస్వామి మాతో మాట్లాడుతూ ఈ ఆలయాన్ని చాలా కాలం కిందటే కట్టినట్లుగా తెలిపారు. ఎవరైతే తమ తలలను ఈ ఆలయంలోని భైరవ దేవుడి ముందు వంచి నమస్కారం చేస్తారో వాళ్లు క్షేమంగా తమ గమ్యం చేరుతారని, ఎవరైతే దేవుడిని సందర్శించకుండా పోతారో వాళ్లకు ఏదో ఒక ప్రమాదం జరిగితీరుతుందని వాళ్లు చెప్పారు.

వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT|
Driver Praying
WD
అయితే కొంతమంది డ్రైవర్లు ఈ ప్రాతంలో తిరిగే దయ్యాల ఉనికిని నమ్మడం కంటే భైరవదేవుడికి భక్తిపూర్వకంగా పూజలు చేస్తున్నట్లు మాకు స్ఫురించింది. ట్రక్కు ప్రమాదానికి గురై డ్రైవర్ అక్కడికక్కడే చనిపోయి ఉన్న ఘటనను మేం చూశాం. ఈ ప్రాంతంలో ఇలాంటి ప్రమాదాలను తరచుగా చూస్తుంటామని పోలీసు అధికారులు తెలిపారు. అయితే కొంతమంది అనుభవజ్ఞులు ఈ ఘాట్‌లోని ప్రమాదకర మలుపుల కారణంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని చెప్పారు. కాబట్టి ఈ మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు ఎవరైనా సావధానంగా ఉండటం అవసరం. అయితే.. ఈ విశ్వాసాన్ని గురించి మీరేమనుకుంటున్నారో మాకు రాయండి.


దీనిపై మరింత చదవండి :