ఒక్క ఫోను కాల్‌తో పాము కాటుకు విరుగుడు

Cobra
Shruti AgarwalWD
ఫోను కాల్ తో పాముకాటుకు విరుగుడు సాధ్యమా? ఈ దశలో ఫోను కాల్తో పాము కాటు బారిన పడిన బాధితునికి స్వస్థత చేకూర్చే వ్యక్తిని గురించి మీకు తెలియచేయబోతున్నాము. ఆశ్చర్యపడకండి... ఇది నిజంగా జరిగిన సంఘటన. మేము దీని సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసేందుకు సిద్దంగా ఉన్నాము. మేము మా ప్రయాణాన్ని ఇండోర్లోని రాంబాగ్ కాలనీ (మధ్యప్రదేశ్) నుంచి ప్రారంభించాము.

ఫోటోగ్యాలరీకోసం ఇక్కడ క్లిక్ చేయండి

అక్కడకు చేరుకున్న తరువాత, పాము కాటుకు విరుగుడు చూపే ఆ వ్యక్తిని అన్వేషించసాగాము. ఆ ప్రాంతంలోని ప్రాంతీయ రక్షకభట నిలయంలో ఆ వ్యక్తిని కనుగొనడం మాకు ఆశ్చర్యం కలిగించింది. ఇప్పుడు, మేము కలుసుకున్న వ్యక్తి రక్షక భట నిలయంలో గత 25 సంవత్సరాలుగా పోలీసు కానిస్టేబుల్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.
Yaswant Bhagavat
Shruti AgarwalWD


అతనే యశ్వంత్ సింగ్ ఫోను ద్వారా పాము కాటు బాధితులకు ఉపశమనం కలిగిస్తున్న వైనాన్ని మాకు తెలియజేసిన వ్యక్తి. పాము కాటు విరుగుడులో కొన్ని సంస్కృత మంత్రాలను తాను కనుగొన్నట్లు అతను మాతో అన్నాడు. అతను మాట్లాడుతూ ఉండగా, అతని టేబుల్పై గల ఫోను మ్రోగడం ప్రారంభించింది. అతడు ఏ విధంగా ఫోను ద్వారా పాము కాటుకు ఉపశమనం కలిగిస్తున్నది మా కనులారా చూసాము.

WD|
చర్చలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే ఇక్కడ క్లిక్ చేయండి


దీనిపై మరింత చదవండి :