కొబ్బరికాయతో భూగర్భ జల వనరుల ఉనికి

Narayan
WD
కర్ర లేదంటే కొబ్బరి కాయతో భూగర్భ జల వనరు పరిమాణాన్ని కొలవడాన్ని మీరెక్కడైనా చూశారా? ఏదినిజం శీర్షికలో ఈ ప్రశ్నకు సమాధానం కనుగొనేందుకు మేము ప్రయత్నించాం. ఇండోర్‌లో భూగర్భ జల పరిమాణాన్ని కనుగొనే ప్రత్యేక జ్ఞానం కలిగిన ఓ వ్యక్తి గురించి తెలుసుకుని, ఆయనను కలిసేందుకు వెతికాం. చివరకు గంగా నారాయణ్ శర్మను కలిసిన తర్వాత మా వెతుకులాట ఆగింది. తన పరికరాలు, కర్ర, కొబ్బరికాయలతో భూగర్భ జల పరిమాణాన్ని కొలవడం సాధ్యమేనని శర్మాజీ చెబుతున్నారు. ఏ ప్రదేశంలో భూగర్భ జలం ఎక్కువగా ఉందో, ఎక్కడ తక్కువగా ఉందోననే విషయాన్ని అది కొలుస్తుందట.

తక్కువ లోతులో ఉన్న నీటి పరిమాణాన్ని కనుగొనేందుకు సైతం శర్మాజీ ఆంగ్ల వై ఆకారంలో ఉన్న ఓ కర్రను ఉపయోగిస్తున్నారు. కర్ర రెండు కొనల్ని చేతితో పట్టుకుని ఆ స్థలంలో ఓ రౌండ్ తిప్పుతాడు. అధిక వేగంతో ఆ కర్ర తిరిగితే ఆ ప్రదేశంలో భూగర్భ జలం ఉన్నట్టు లెక్క. దీనిని ఆయన డౌజింగ్ టెక్నిక్ అంటున్నారు. ఈ టెక్నిక్ ఉపయోగించడం ద్వారా భూగర్భ జలాలను కనుగొనే యత్నంలో 80శాతం మేర తాను విజయం సాధించానని చెబుతున్నారు.
కొబ్బరికాయతో భూజల వనరుల పరిమాణం సాధ్యం...?
  కొబ్బరికాయను నిటారుగా అరచేతిలో నిలబెట్టాలి. భూగర్భ జలం ఉన్న చోట అయితే అది ఏ మాత్రం పట్టు లేకుండానే అరచేతిలో నిటారుగా నిలబడుతుంది.      


కర్ర మాత్రమే కాదు కొబ్బరికాయను కూడా దీనికోసం ఉపయోగించవచ్చు. ఈ విధానంలో కొబ్బరికాయను నిటారుగా అరచేతిలో నిలబెట్టాలి. భూగర్భ జలం ఉన్న చోట అయితే అది ఏ మాత్రం పట్టు లేకుండానే అరచేతిలో నిటారుగా నిలబడుతుంది. అలా నిలబడితే అక్కడ నీళ్లుంటాయన్నమాట. బోరు ఏర్పాటు చేసే సమయంలో నీళ్లు ఉన్న ప్రదేశాన్ని కనుగొనేందుకై బిల్డర్లు కూడా ఇతని పద్దతినే అవలంభించటం గమనార్హం. ఈ పద్దతిని అవలంబించడం ద్వారా పరిశోధించే ఖర్చులతో పాటు శారీరక శ్రమ కూడా మిగులుతుందంటాడు.

WD
ఆయన వాదన నిజమేనా అనే విషయం వాదించదగ్గదే అయినప్పటికీ పలు పర్యాయాలు ఆయన చెప్పిన విషయం నిజం కాలేదు. 150-200 అడుగుల లోతులోనే నీళ్లు లభిస్తాయని చెప్పిన చోట నాలుగు వందల అడుగుల వరకు కూడా లభించలేదు. అయినప్పటికీ జనం మాత్రం శర్మాజీని గట్టిగా విశ్వసిస్తున్నారు.

వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT|
నీళ్ల పరిమాణం బాగా తగ్గిపోతుంది. బోర్‌వెల్ ఏర్పాటుకు అవుతున్న అధిక ఖర్చులు జనాల్ని ఇటువంటి వాటిని నమ్మేలా ప్రోత్సహిస్తున్నాయి. సమయం, డబ్బు ఆదా చేసేందుకై గంగా నారాయణ్ వంటి వారిని వెతుక్కుని మరీ వెళుతున్నారు. నీటి పరిమాణాన్ని కనుగునేందుకు ఇటువంటి విద్యలు పనిచేస్తాయని మీరు విశ్వసిస్తున్నారా? మీ అభిప్రాయమేమిటి? దయచేసి మాకు రాయండి.


దీనిపై మరింత చదవండి :