చేతబడుల లోయగా పేరొందిన హుస్సేన్ టేక్రీలోని మురికి నీటిలో స్నానం చేయడంతో భూత, ప్రేత, పిశాచాల బెడద తొలగిపోతుందని కొందరి విశ్వాసం. దీనిని ఆచరిస్తున్న వారిని మేము కళ్లారా చూశాం. ఆ ప్రాంతానికి మేము ఉదయం 7.00 గంటలకు చేరుకున్నాము.