దేహంలోని రాళ్ళను నోటితో పీల్చివేసే చికిత్స

Temple where Sita Baai treats
Shruti AgarwalWD
“ఆస్థా మరియు అంథవిశ్వసాల” కొనసాగింపులో భాగంగా మా తరువాతి ఎంపిక మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయినీ పట్టణానికి సమీపంలో గల “రాలయా” గ్రామం. ఈ గ్రామంలోని ఒక వృద్ధురాలు దేహం నుంచి రాళ్ళను పీల్చివేయడం ద్వారా రోగుల రాళ్ళ వ్యాధిని నయం చేస్తుందని విన్నాం. ఈ వింతను ప్రత్యక్షంగా చూసేందుకు ఒక గ్రామీణుడి సహకారంతో రాలయాటకు దారి తెలుసుకున్నాం.

ఫోటో గ్యాలరీకోసం ఇక్కడ క్లిక్ చేయండి

చుట్టూ అనేక మంది చేరి ఉండగా సీతా బాయి అనే వృద్ధురాలు తన పనిని మొదలుపెట్టడానికి సిద్దంగా ఉన్నది. ఒక బాలుని వ్యాధి వివరాలు అడిగిన ఆమె అనంతరం దేహంలోని బాధిత ప్రాంతాన్ని పీల్చడం ప్రారంభించింది. కాసేపటి తరువాత నోటి నుంచి కొన్ని రాతి ముక్కలను ఆమె విసిరింది. రాళ్ళ వ్యాధి నుంచి బయటపడేందుకు అనేక మంది అక్కడ బారులు తీరి కనిపించారు.
Sita Baai sucking the stone
Shruti AgarwalWD


సీతాబాయి మాతో మాట్లాడుతూ “నేనీ వృత్తిలో గత 18 సంవత్సరాలుగా ఉన్నాను.” తన సంభాషణను కొనసాగిస్తూ “ ఈ ప్రక్రియలో ఉండగా గాలిలోని 52 ప్రాంతాలలో విహరిస్తున్న భావనకు నేను లోనవుతాను. నిర్దారిత ప్రాంతాన్ని అనుసరించి పనితీరును మారుస్తాను. “మా” పై నమ్మకంతో ఈ చికిత్స ను చేస్తున్నాను. పూర్తి విశ్వాసం, గౌరవం ఉంటే ఎలాంటి వ్యాధి అయినా నయమవుతుంది.”

Shruti Agarwal|
చర్చలో పాల్గొనాలని భావిస్తున్నారా? అయితే ఇక్కడ క్లిక్ చేయండి.


దీనిపై మరింత చదవండి :