మద్యం సేవిస్తున్న కాలభైరవుని విగ్రహం

Idol of Kal-Bhairava
Shruti AgarwalWD
విగ్రహమేదైనా మద్యం తాగడాన్ని గతంలో మీరు చూశారా? ఖచ్చితంగా లేదనే చెపుతారు మీరు. విగ్రహం మద్యాన్ని ఎలా తాగుతుంది?

ఫోటోగ్యాలరీకోసం ఇక్కడ క్లిక్ చేయండి
విగ్రహం నిర్జీవమైనది మరియు మా అనుభవాన్ని అనుసరించి నిర్జీవాలకు ఆకలి, దాహం తదితర భావనలు కలిగే అవకాశం లేనే లేదు... అయితే ఈ విషయంలో ఉజ్జయినికి చెందిన కాలభైరవ విగ్రహానికి మినహాయింపు ఇవ్వక తప్పదు. భక్తుడు నివేదించిన మద్యాన్ని కాలభైరవుని విగ్రహం తాగడం మేము ప్రత్యక్షంగా చూసాము.
Main gate entrance of Kal-Bhairava Temple
Shruti AgarwalWD

‘ఏది నిజం'కు కొనసాగింపుగా ఈ రహస్యం వెనుక దాగి ఉన్న నిజాన్ని వెలికితీయాలని మేము ప్రయత్నించాము. నిజ నిర్థారణకు గాను మేము ఉజ్జయిని నగరానికి పయనమయ్యాము. ఉజ్జయిని... మహాశివుని ద్వాదశ జ్యోతిర్లంగాలలో ఒకటైన మహాకాళేశ్వరుడు కొలువైన దేవాలయాల నగరం. కానీ మా గమ్యస్థానం మహాకాళేశ్వరుని దేవాలయానికి ఐదు కి.మీ.ల దూరంలో గల కాలభైరవుని ఆలయం. ఆలయ ప్రధాన ద్వారానికి త్వరగానే చేరుకున్నాము.

దేవాలయం వెలుపల గల దుకాణాలలో పూజాద్రవ్యాలు, పుష్పాలతో పాటు మద్యం కూడా ఉండటం మా దృష్టిని ఆకర్షించింది. మా ముందే కొంత మంది భక్తులు మద్యపు సీసాలను దుకాణాల నుంచి కొనుగోలు చేయడం గమనించాము.
Shruti Agarwal|
మీరు చర్చలో పాల్గొనాలని భావిస్తున్నారా? అయితే ఇక్కడ క్లిక్ చేయండి.


దీనిపై మరింత చదవండి :