వీర బాదుడుతో వ్యాధి మాయం చేస్తా....

Mansaraam
WD
ఏదినిజంలో శీర్షికలో భాగంగా... మీకు ఓ వినూత్న చికిత్సా పద్ధతిని గురించి తెలియజేయబోతున్నాం. ఈ చికిత్సా పద్థతిలో రోగులను పిడి గుద్దులు గుద్దటం లేదా బలంగా తన్నటం ద్వారా వ్యాధిని నయం చేయటం జరుగుతుంది. ఇలా చావబాదే ప్రక్రియలో రోగుల వ్యాధిని నయం చేస్తానని చెపుతున్నాడు ఛత్తీస్‌గఢ్‌కి చెందిన మాన్సారామ్.

ఈ వార్త మా చెవినబడిన మరు క్షణం... మేము ఛత్తీస్‌గఢ్‌కు బయలుదేరాం. రాష్ట్ర రాజధాని అయిన రాయ్‌పూర్‌కు 75 కిలోమీటర్ల దూరంలోనూ, ధమాత్రి పట్టణానికి 35 కిలో మీటర్ల దూరంలో ఉన్న లాడెర్ గ్రామంలో సదరు చికిత్స చేసే వ్యక్తి నివాసం అని తెలుసుకున్నాం. ఆ గ్రామానికి చేరుకున్న మాకు... అక్కడ వేల మంది చికిత్సకోసం ఎదురుచూస్తుండటం కన్పించింది. మేము చూస్తుండగానే కొద్దిసేపటికి.... మాన్సారామ్ గంభీరంగా బయటకు వచ్చి అక్కడే ఉన్న ఓ చెట్టు కింద కూర్చున్నాడు. ఆ తర్వాత వరుసక్రమంలో రోగులను పిడిగుద్దులు గుద్దటం... కాళ్లతో ఇష్టం వచ్చినట్లు శక్తి కొద్దీ ఈడ్చి తన్నటం ప్రారంభించాడు. మిగిలిన రోగులు తమ వరుస ఎప్పుడు వస్తుందా... అని తన్నించుకునేందుకు ఎదురుచూస్తున్నారు.
Kicking
WD


వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT|
తాను ఎటువంటి రోగాన్నైనా మటుమాయం చేస్తానని మాన్సారామ్ చెపుతున్నాడు. అంతేకాదు అతను ఈ చికిత్సను ఎందుకు? ప్రారంభించాడన్న సంగతిని మాకు చెప్పాడు. మూడేళ్ల క్రితం దాకా తాను ఓ సామాన్య రైతుననీ... అయితే ఒకనాటి రాత్రి ఓ దేవతామూర్తి తనకు కలలో కన్పించి రోగులకు ఇలా చికిత్సను చేయమని ఆదేశించిందని మాతో చెప్పాడు. అంతేకాదు తాను గత ఏడాదిగా ఎటువంటి ఆహారాన్ని భుజించటంలేదనీ... తనకు ఆయా దేవతామూర్తులు శక్తిని ప్రసాదిస్తున్నారని అంటున్నాడు.


దీనిపై మరింత చదవండి :