అపారమైన విశ్వాసం... అద్భుతాల సమాహారం

Satyasai Mandir
WD
ఆయన చేయి చాపితే చాలు.... శివలింగం ప్రత్యక్షం. అంతర్జాతీయ ఆధ్యాత్మిక నేతగా భక్తుల నీరాజనాలందుకుంటున్న ఆయన...చిటికె వేస్తే చాలు విభూతి రాలుతుంది. మీరు ఊహించింది నిజమే... ఆయనే సత్యసాయిబాబా... ఈ వారం ఏది నిజం శీర్షికలో సత్యసాయిబాబాను మీకు పరిచయం చేస్తున్నాం.

ఆంధ్రప్రదేశ్, అనంతపురం జిల్లా, ప్రశాంతి నిలయం (పుట్టపర్తి) పట్టణంలో నివాసం ఉంటున్నప్పటికీ, సత్యసాయిబాబాను అంతర్జాతీయ ఆధ్యాత్మిక నేతగా భక్తులు కొలుస్తుంటారు. అదే క్రమంలో సత్యసాయిబాబాకు పలు అద్భుతాలు, విశ్వాసాలు ఆయన అనుయాయులు ఆపాదిస్తుంటారు. భక్తుల బాధలను స్వీకరించి వారి ఈతిబాధలను తీర్చే భగవత్‌స్వరూపునిగా బాబాను నమ్మినవారు త్రికరణ శుద్ధిగా చెప్తుంటారు. మానవాతీతమైన అద్భుతాలకు ప్రశాంతి నిలయం ప్రపంచ వ్యాప్తంగా పేరొందడానికి సత్యసాయిబాబానే కారణమని తెలుపుతుంటారు.
మీరు కూడా దైవ స్వరూపులే...
  “నేను దేవుడిని. మీరు కూడా దైవస్వరూపులే. ఈ విషయం నాకు సంపూర్ణంగా అవగతం కాగా మీరు పూర్తిగా అవగతం చేసుకోలేదు. ఇదే మీకు నాకు గల వ్యత్యాసం."      


విభూతి, తినుబండారాలు, బంగారపుటుంగరాలు, స్వర్ణశోభితమైన కంఠహారాలు ఇత్యాది వాటిలో ఏదో ఒకదానిని కరకమలాల నుంచి సృష్టించి బాబా భక్తులకు అందిస్తుంటారు. ప్రతిరోజూ తన దర్శనార్థం విచ్చేసే భక్తులకు పైన పేర్కొన్న వస్తువుల్లో ఏదో ఒకదానిని ప్రసాదంగా ఇవ్వడం బాబా దినచర్యలో ఒక భాగమని భక్తులు చెప్పుకుంటుంటారు.

వేర్వేరు ప్రదేశాల్లో ఒకేసారి దర్శనమివ్వడం, శారీరకంగా అదృశ్యం కావడం, రాతిని చక్కెరగా మార్చడం, నీటిని వేరే పానీయంగా మార్చడం, నీటిని పెట్రోల్‌గా మార్చడం, కోరిన వస్తువులను సృష్టించడం, ధరించి ఉండగానే తన వస్త్రాల వర్ణాన్ని ఇట్టే మార్చడం, ఆహారాన్ని రెట్టింతలు చేయడం, వ్యాధుల నివారణ, దృశ్యాలు, స్వప్న సాక్షాత్కారం, వృక్షానికి సహజాతిసహజమైన పండ్లకు బదులుగా వేరే పండ్లను సృష్టించడం, వాతావరణాన్ని నియంత్రించడం, ఇతర దేవతల స్వరూపంలోకి శారీరకంగా మారిపోవడం, శరీరం నుంచి కాంతిని వెలువరించడం తదితర సత్యసాయిబాబా లీలలను గురించి భక్తులు విశేషంగా కీర్తిస్తుంటారు.
Miracle starts
WD


వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT|
అయితే అద్భుతాలను సృష్టించడం దైవిక శక్తిలో ఒక భాగమని సత్యసాయిబాబా వివరిస్తుంటారు. కానీ తన అద్భుతాలను శాస్త్రీయమైన కోణంలో పరిశోధించేందుకు ఆయన సుతరామూ అంగీకరించరని హేతువాదులు ఆరోపిస్తుంటారు. హస్తలాఘవంతోనే బాబా వస్తువులను సృష్టిస్తుంటారని విమర్శకులు చెప్తుంటారు. బాబా మహత్మ్యాల వెనుక ఆరోపణలను కొన్ని భారతీయ పత్రికలు ప్రముఖంగా ప్రచురించిన వైనాన్ని విమర్శకులు ప్రధానంగా ప్రస్తావిస్తుంటారు.


దీనిపై మరింత చదవండి :