ఏ రాజూ బసచేయలేని నగరం.... తెలుసుకుందాం రండి

Maha Kaleswar
WD
మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం... మధ్య భారతదేశంలోని ఒకానొక ప్రముఖ నగరంలో రాత్రిపూట బస చేసేందుకు రాజాధిరాజులు జంకుతుంటారు... ఈ నగరం జ్యోతిర్లంగంతో ప్రసిద్ధి చెందింది.... మీ ఊహ సరైందే.. మనం మాట్లాడుకుంటోంది మహాకాళుని నగరమైన ఉజ్జయినీ గురించి. ఉజ్జయినీ రాజు మహాకాళుడు మాత్రమేనని స్థానికులు విశ్వసిస్తున్నారు. ఏమరుపాటున వేరే రాజులు ఎవరైనా ఇక్కడ రాత్రి పూట బస చేసినట్లయితే, వారి రాజ్యానికి, అధికారానికి నీళ్ళు వదులుకోవాల్సిందే.

దీని వెనుక రహస్యం ఎవరికి అంతు పట్టకున్నప్పటికీ, ప్రస్తుత కాలంలో ప్రముఖ రాజకీయ నేతలు, ముఖ్యమంత్రి లేదా ప్రధానితో సహా ఉజ్జయినీలో రాత్రి పూట బసచేయడానికి వెనుకడుగు వేస్తుంటారు. స్వాతంత్రం రావడానికి ముందు గ్వాలియర్ మహారాజులైన సింథియాల రాజ్య పరిధిలో ఉజ్జయిని ఉండేది. రాజకుటుంబీకులు ఎవరైనా ఈ నగరాన్ని సందర్శించినప్పుడు నగరానికి వెలుపల నిర్మితమై కాళీయాడే పేరుతో పిలవబడే రాజప్రాసాదంలో బస చేసేవారు.
Kaaliyaadeh palace
WD


వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT|
ఇది సింథియాలకే పరిమితమవలేదు... క్రమంగా ఇదే సంప్రదాయాన్ని మిగిలిన నేతలు కూడా పాటించటం మొదలుపెట్టారు. ఈ సంప్రదాయం రాష్ట్ర కార్యకలాపాలలోనూ ఆవరించింది. దీనితో ప్రభుత్వ కార్యకలాపాలు సాఫిగా జరిగిపోయేందుకుగాను సింధియాలు నగరానికి వెలుపల కాలియాడే ప్యాలెస్‌ను నిర్మించారు. ప్రభుత్వ అధికారులు ఉదయం వేళ నగరంలో తమ పనిచూసుకుని సాయంత్రానికల్లా కాలియాడే ప్యాలెస్‌కు తిరిగి రావాల్సిందే.


దీనిపై మరింత చదవండి :