శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. »
  3. ఏది నిజం
  4. »
  5. కథనం
Written By PNR

అతీంద్రియ శక్తిని తలపించే.. దేవాస్ మహాకాళేశ్వరుడు

WD PhotoWD
భక్తుల సంక్షేమం కోసం భగవంతుడు వారి ఎదుట ప్రత్యక్షమవుతాడా? ఒక ప్రతిమ మానవుని వలె పెరుగుతుందా? నిజ జీవితంలో ఇటువంటి అద్భుతాలు సాధ్యమేనా? ఈ ప్రశ్నలకు జవాబులు ఎవ్వరికీ తెలియవు. కానీ ప్రతి ఒక్కరూ అతీంద్రియ శక్తుల తాలూకు ఆశ్చర్యం కలిగించే అంశాలను చవిచూసి ఉంటారు.

కొన్నిసార్లు చెట్టులోను లేదా మరికొన్నిసార్లు ప్రసాదం (దేవుడికి నివేదించేది)లోనూ ప్రజలు వీక్షించే దేవుడు, వారి ఎదుటనే అదృశ్యమవుతాడు. "ఏది నిజం" పరంపరలో భాగంగా ఆశ్చర్యాలకు పేరొందిన దేవాలయాన్ని మేము చేరుకున్నాము. ఈ వృత్తాంతాన్ని చదవిన అనంతరం అది విశ్వాసం లేదా ఖచ్చితంగా మూఢనమ్మకం అనేది మీరే నిర్ణయించండి.

ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

'ఏది నిజం' విభాగంలోని ప్రస్తుత ఎపిసోడ్‌లో, దేవాస్‌ మహాకాళేశ్వర దేవాలయాన్ని మీ ముందుంచుతున్నాము. వేలకొలది భక్తుల విశ్వాసాన్ని ఈ దేవాలయం
WD PhotoWD
ఆపాదించుకున్నది. ఈ దేవాలయంలోని శివలింగం స్వయంభువుగా అవతరించడమే గాక లింగం యొక్క ఎత్తు క్రమక్రమంగా పెరుగుతున్నదని దేవాలయానికి సమీపంలో నివసించేవారు మరియు నిత్యం విచ్చేసే భక్తులు నొక్కి చెప్తున్నారు. వారి మాటలలోని యదార్ధం తెలుసుకునేందుకు మేము స్థానికులతో మాట్లాడాము.

WD PhotoWD
దేవాలయ ప్రాంగణంలోకి ప్రవేశించినంతనే, పూజలు చేస్తున్న కొందరు భక్తులను మేము చూసాము. మహాకాళేశ్వరుడు తమ కోరికలను తీరుస్తాడని వాళ్ళు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. ఇక్కడి శివలింగం ఉజ్జయినీలోని మహాకాళ్ దేవాలయ శివలింగాన్ని పోలి ఉంది. మాకు తెలిసినంతవరకు ఒకవైపు మహాకాళుని శివలింగం త్వరగా కుచించుకుపోతుండగా మరోవైపు దేవాస్ శివలింగం తన ఎత్తును పెంచుకుంటూ పోతున్నది.

దేవాలయానికి సమీపంలో నివసించే రాధాకృష్ణ తాను బాల్యం నుంచి దేవాలయానికి వస్తుంటానని అదేసమయంలో శివలింగం ఎత్తు నిరంతరాయంగా పెరుగుతుండటాన్ని కనుగొన్నానని మాతో అన్నాడు. అంతేకాక ప్రతి 'శివరాత్రి' పర్వదినానికి లింగం యొక్క ఎత్తు పెరుగుతున్నదని వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. కానీ ఎత్తు పెరుగుదల అతి స్వల్పమైనందున లింగం ఎత్తులో మార్పును నాలుగు లేదా ఐదు సంవత్సరాల తర్వాత మాత్రమే గుర్తించగలము.

ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లింగం స్వయంభువుగా అవతరించడం వెనుక గల ఒక కథ విస్తృత ప్రచారంలో ఉన్నది. కథను అనుసరించి, దాదాపు వంద సంవత్సరాలకు పూర్వం, ఎటువంటి
WD PhotoWD
సమాచార సాధానాలకు అందుబాటులో లేని కుగ్రామంగా దేవాస్ ఉన్న కాలంలో, శివభక్తులలో అగ్రగణ్యుడైన గౌరీ శంకర్ అనే పూజారి ఉండేవాడు. ఈ దేవాలయంలో పూజాదికాలు జరిపేంతవరకు అతడు అన్నపానీయాలు ముట్టుకునేవాడు కాదు. ఒకానొక సమయంలో వరదల కారణంగా దేవాలయానికి వెళ్ళే మార్గానికి అవరోధం ఏర్పడటంతో దేవాలయంలో పూజాదికాలు జరుపలేక పోయాడు.
WD PhotoWD
వరద తగ్గుముఖం పట్టకపోవడంతో శోకతప్త హృదయుడైన అతడు ఆహారాన్ని తాకలేదు. దాదాపుగా అతడు మృత్యుదేవత ఒడిలోకి చేరుతుండగా, మహాశివుడు అతని ఎదుట ప్రత్యక్షమయ్యాడు. ఏదైనా వరం కోరుకొమ్మని భోళాశంకరుడు గౌరీ శంకర్‌ను అడుగగా, ప్రతి రోజు పరమశివుని దర్శన భాగ్యం ప్రసాదించమని అతడు కోరుకున్నాడు. అందుకు అంగీకరించిన గంగాధరుడు ఎక్కడైతే ఐదు బిల్వపత్రాలను ఉంచుతావో అక్కడ పరమశివుడు ప్రత్యక్షమవుతాడని తెలిపాడు.

ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆ సంఘటన చోటు చేసుకున్న అనంతరం, మహాశివుడు ఈ ప్రాంతంలో వెలిసాడు. గ్రామప్రజలు ఆ ప్రాంతంలో ఒక దేవాలయాన్ని నిర్మించారు. కాలం గడిచేకొద్ది ఈ ప్రాంతం ఆధ్యాత్మిక నెలవుగా రూపాంతరం చెందింది. ఈ దేవాలయంలోని శివలింగం నిరంతరాయంగా తన ఎత్తును పెంచుకుంటున్న వైనాన్ని కనుగొన్నారు.
WD PhotoWD
దేవాలయ కార్యనిర్వాహక కమిటీ అధ్యక్షుడైన భీమ్ సింగ్ మాతో మాట్లాడుతూ, అనేక సంవత్సరాలుగా దేవాలయ కమిటీలో ఉన్న తాను శివలింగం పెరగడాన్ని గమనించినట్లు తెలిపాడు. అతని విశ్వాసానికి తార్కాణం అన్నట్లుగా మాకు కొన్ని పాత ఫోటోలను ఆయన చూపించాడు. ఆయన చూపించిన ఫోటోలోని శివలింగం, ప్రస్తుత శివలింగం కన్నా తక్కువ ఎత్తులో ఉండటాన్ని మేము కనుగొన్నాము.

ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కానీ శివలింగం పెరుగుదలను ఫోటోలు మాత్రమే సమర్ధించలేవు. తమ అవాంఛనీయమైన కోరికలను తీర్చుకోవడంలో భాగంగా అమాయక ప్రజలను మోసం చేసేందుకు కొందరు టక్కుటమారాలను ప్రదర్శిస్తుంటారు. కొన్ని భౌగోళిక చర్యల కారణంగా లింగం యొక్క పెరుగుదల సాధ్యపడి ఉండవచ్చునని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఈ ప్రక్రియ వలన భూమిపై శిఖరాలు కనుగొనబడ్డాయి. కానీ దీని గురించి మీరు ఏమి అనుకుంటున్నారో మాకు రాసి పంపండి.