శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. »
  3. ఏది నిజం
  4. »
  5. కథనం
Written By PNR

"ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ఉపశమనమందిస్తున్న బాబా..!"

WD PhotoWD
వింతలకు మహిమలకు భారతదేశం పుట్టినిల్లు. యోగా, 'మంత్రతంత్రాలు' మరియు మూలికా ఔషధాలతో పలురకాల వ్యాధులు నయమవుతాయని ఇక్కడి ప్రజల విశ్వాసం. కానీ కొన్నిసందర్భాలలో ప్రజల విశ్వాసం ఆధార రహితమని తేలింది. సాధారణంగా ప్రజల విశ్వాసాలను ఆధారంగా చేసుకుని ప్రజలను మోసం చేసే వారిని మనం చూస్తుంటాము. ఈ నేపథ్యంలో 'ఏదీనిజం' కొనసాగింపులో భాగంగా అటువంటి ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తున్నాము. అతడు మోసగాడు అవునో కాదో మీరే తేల్చుకోండి.. మేము చూసిన సంఘటనలను పూసిగుచ్చినట్లుగా మీకు తెలియచేసుకుంటున్నాము.

ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

త్రయంబక గ్రామానికి మేము ప్రయాణం చేస్తుండగా నాసిక్ - త్రయంబక్ రహదారికి సమీపంలో నివసిస్తూ 'గొడ్డలి బాబా'గా పిలవబడే రఘనాథ్ దాస్ గురించి తెలుసుకున్నాము. రోగి తలపై గొడ్డలిని ఉంచడం ద్వారా ఎయిడ్స్, క్యాన్సర్ తదితర వ్యాధులను నిర్ధారిస్తానని అతడు చెప్పుకుంటాడు. అంతేకాక తాను నిర్ధారించిన రోగాలను అతడు నయం చేస్తాడు. అతని మాటల్లో నిజానిజాలను నిగ్గు తేల్చడానికి మేము ప్రయత్నించాము.

ఆక్రమంలో మా వాహనాన్ని రఘునాథ్ బాబా ఆశ్రమం వైపు మళ్ళించాము. అక్కడి ఆశ్రమంలో పెద్దహాలు ఒకటి కనిపించింది. వ్యాధినివారణ కోసం అనేక మంది
WD PhotoWD
ప్రజలు అక్కడ వరుసక్రమంలో నిలబడి ఉన్నారు. దాదాపు 40 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన ఒక వ్యక్తి మంచం మీద కూర్చుని ఉన్నాడు. రోగి తలపై రాతిని ఉంచిన అతడు ఏవో మంత్రాలను గొణుగుతున్నాడు.

అతడి చుట్టు పక్కల ఉన్న కొంత మంది వ్యక్తులు రోగులకు ఔషధాలను సూచిస్తున్నారు. అతడు రోగులకు చెపుతున్న మాటలను విని కంగుతినడం మావంతు అయ్యింది. అతని మాటలు ఎలా ఉన్నాయంటే... "మీ రక్తంలో చక్కెర శాతం తక్కువగా ఉంది అలాగే దాని శాతం ఎంత ఉన్నదంటే..." అంతటితో ఆగక అతడు క్యాన్సర్, ఎయిడ్స్ మరియు కణితి తదితర వ్యాధులను సైతం పరీక్షిస్తున్నాడు.

చర్చలో పాల్గొనాలని భావిస్తున్నారా? అయితే.. ఇక్కడ క్లిక్ చేయండి.

WD PhotoWD
ఇక అసలు కథ మొదలయ్యేది ఇప్పుడే... కొద్ది సేపటి తరువాత, రోగులలో ఒకతను లేచి నిలబడి తన వస్త్రాలను బాబా ముందుంచగా వాటిపై గొడ్డలిని ఉంచిన బాబా వ్యాధిని నిర్థారించసాగాడు. మరొకతను తన భార్య ఫోటోను బాబా ముందు ఉంచాడు. వస్త్రాలకు లాగానే ఫోటోతో కూడా అదే ప్రక్రియను అమలు చేసిన బాబా ఇట్టే వ్యాధిని నిర్థారించాడు. ఇలా కొన్ని గంటలపాటు బాబా తన వైద్య ప్రక్రియను, రోగ నిర్ధారణను కొనసాగించాడు. బాబాను కలుసుకోవాలన్న మా వాంఛను ఆయన అనుచరుల ముందుంచాము. తోటలోకి వచ్చి బాబాను కలుసుకోవలసిందిగా వారు మాకు సూచించారు. బాబా తోటలో కొన్ని మూలికలు మరియు కాక్టస్ మొక్కలు మాకంట పడ్డాయి.

ఈ మూలికలతోనే వ్యాధులను నివారించే ఔషధాలను తయారు చేస్తానని మాటల మధ్యలో రఘునాధ్ మాతో అన్నాడు. తాను తయారు చేసిన ఔషధాలతో ఎయిడ్స్, క్యాన్సర్ తదితర వ్యాధులను నయం చేస్తుంటానని ఆయన తెలిపాడు. గొడ్డలి వెనుక రహస్యాన్ని మేము ఆయన ఎదుట ప్రస్తావించగా, ఆయన ఏమన్నారంటే "రాయి 'గురు' ప్రసాదితమైనది. నేను చాలాకాలం పాటు అటవీ ప్రాంతాలలో గడిపాను. ఆసమయంలో అక్కడి ప్రజల ద్వారా మూలికల ప్రాధాన్యతన
WD PhotoWD
తెలుసుకుని, పలు వ్యాధుల నివారణ లో కీలక పాత్ర పోషించే మూలికావైద్యాన్ని నేను నేర్చుకున్నాను."

మీరు తయారు చేసిన ఔషధాలు చక్కగా పనిచేస్తున్నప్పుడు, ప్రభుత్వం సహాయంతో వాటిని పేటెంట్ చేయించుకోవచ్చుగదా అని మేము అడుగగా, ఆయన మాట మార్చి చర్చను పక్కదారి పట్టించాడు. ఇతర ఔషధాలు కేవలం వ్యాధి యొక్క మూలాన్ని నశింపచేసి వ్యాధిని నివారిస్తాయని, అయితే తాను కాక్టస్‌తో తయారుచేసిన 'తబీజ్' రోగులలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుందని ఆయన తెలిపాడు.

ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రఘునాథ్‌తో మాట్లాడిన అనంతరం రోగుల దగ్గరకు వెళ్ళాము. రోగులలో అనేకమంది మొదటి సారిగా ఇక్కడికి వచ్చిన వారే. పేరు చెప్పడానికి నిరాకరించిన వ్యక్తి తనను తాను ఎయిడ్స్ వ్యాధిగ్రస్తునిగా పరిచయం చేసుకున్నాడు. తన రాకకు గురించిన కారణాన్ని చెపుతూ "ఈ వ్యాధి నయం కాదని నాకు తెలుసు, కానీ నా సన్నిహిత మిత్రుడు చెప్పడంతో ఇక్కడకు వచ్చాను" అని అతడు అన్నాడు.

చర్చలో పాల్గొనాలని భావిస్తున్నారా? అయితే.. ఇక్కడ క్లిక్ చేయండి.

WD PhotoWD
అతనిలాగానే, మెదడులో కణితితో బాధపడుతున్న తన కుమార్తె ఆరోగ్యం కోసం బాలాజీ షెకావత్ అనే వ్యక్తి ఇక్కడకు వచ్చాడు. మెదడులో కణితితో బాధపడుతున్న తమకు తెలిసిన వ్యక్తి ఇక్కడికి వచ్చి నయం చేయించకోవడంతో, తన కుమార్తెకు కూడా నయమవుతుందన్న ఆశ తనను ఇక్కడకు రప్పించిందని బాలాజీ మాతో అన్నాడు.

తమ వ్యాధులు తొలగిపోతాయనే ఆశతో అనేకమంది అక్కడకి వచ్చియున్నారు. కానీ బాబా వ్యవహారశైలి మాలో అనుమానాలను రేకెత్తించింది. చూడడానికి 40 నుంచి 45 సంవత్సరాల వయస్సు కలవాడిలా కనపడుతూ, 21 సంవత్సరాల కొడుకుతో ఉన్న బాబా తన వయస్సు 70 సంవత్సరాలు అని చెప్పాడు. అంతేకాదు రోగులందరికీ ఒకే ఔషధాన్ని సూచిస్తాడు. ఉబ్బసాన్ని నయం చేసే ఔషధం క్యాన్సర్, ఎయిడ్స్ తదితరల వ్యాధులను ఎలా నయం చేస్తుంది? స్థూలంగా చూసినట్లయితే ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని సాగుతున్న మోసపూరిత వ్యవహారమది.

ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రఘునాథ్ బాబాపై ఆరోపణల

మూఢనమ్మకాల నిర్మూలనా సమితికి ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న డాక్టర్ నరేంద్ర దభోల్కర్ నమోదిత వైద్యుడు కాని బాబా రోగాలను ఎలా నయం చేస్తాడని
WD PhotoWD
అంటున్నారు. రఘునాధ్ బాబాకు వ్యతిరేకంగా 2006 సంవత్సరం ఏప్రిల్ 21వ తేదీన ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయగా ఇప్పటిదాకా అతనిపై ఎటువంటి చర్య తీసుకోలేదని ఆరోపించారు. ఇదే అంశంపై నాసిక్‌లోని ఆయ్‌టక్ హాలులో మీడియా సమావేశాన్ని కొద్ది రోజుల క్రితం ఆయన నిర్వహించారు.

డాక్టర్ నరేంద్ర మాటలను అనుసరించి, ఈ వ్యక్తి అమాయక ప్రజలను మోసగిస్తున్నాడు. ఇదిలా ఉండగా పదిహేను మాసాల క్రితం త్రయంబక్ వైద్యాధికారి డాక్టర్ రాజేంద్ర జోషి ఈ వ్యవహారంపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయగా, అతనికి వ్యతిరేకంగా ఎటువంటి చర్య తీసుకున్న పాపాన పోలేదు. ఇక మూఢనమ్మకాల నిర్మూలన సమితి ఆధ్వర్యంలో అతనికి వ్యతిరేకంగా పాలక స్థాయిలో ఒక ఉద్యమాన్ని చేపట్టాలని నిర్ణయించారు.

చర్చలో పాల్గొనాలని భావిస్తున్నారా? అయితే.. ఇక్కడ క్లిక్ చేయండి.