శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. »
  3. ఏది నిజం
  4. »
  5. కథనం
Written By WD

ఒక్క ఫోను కాల్‌తో పాము కాటుకు విరుగుడు

Shruti AgarwalWD
ఫోను కాల్ తో పాముకాటుకు విరుగుడు సాధ్యమా? ఈ దశలో ఫోను కాల్తో పాము కాటు బారిన పడిన బాధితునికి స్వస్థత చేకూర్చే వ్యక్తిని గురించి మీకు తెలియచేయబోతున్నాము. ఆశ్చర్యపడకండి... ఇది నిజంగా జరిగిన సంఘటన. మేము దీని సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసేందుకు సిద్దంగా ఉన్నాము. మేము మా ప్రయాణాన్ని ఇండోర్లోని రాంబాగ్ కాలనీ (మధ్యప్రదేశ్) నుంచి ప్రారంభించాము.

ఫోటోగ్యాలరీకోసం ఇక్కడ క్లిక్ చేయండి

అక్కడకు చేరుకున్న తరువాత, పాము కాటుకు విరుగుడు చూపే ఆ వ్యక్తిని అన్వేషించసాగాము. ఆ ప్రాంతంలోని ప్రాంతీయ రక్షకభట నిలయంలో ఆ వ్యక్తిని కనుగొనడం మాకు ఆశ్చర్యం కలిగించింది. ఇప్పుడు, మేము కలుసుకున్న వ్యక్తి రక్షక భట నిలయంలో గత 25 సంవత్సరాలుగా పోలీసు కానిస్టేబుల్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.
Shruti AgarwalWD


అతనే యశ్వంత్ సింగ్ ఫోను ద్వారా పాము కాటు బాధితులకు ఉపశమనం కలిగిస్తున్న వైనాన్ని మాకు తెలియజేసిన వ్యక్తి. పాము కాటు విరుగుడులో కొన్ని సంస్కృత మంత్రాలను తాను కనుగొన్నట్లు అతను మాతో అన్నాడు. అతను మాట్లాడుతూ ఉండగా, అతని టేబుల్పై గల ఫోను మ్రోగడం ప్రారంభించింది. అతడు ఏ విధంగా ఫోను ద్వారా పాము కాటుకు ఉపశమనం కలిగిస్తున్నది మా కనులారా చూసాము.

చర్చలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే ఇక్కడ క్లిక్ చేయండి

Shruti AgarwalWD
అతడు మాతో మాట్లాడుతూ “ ప్రక్రియ ప్రారంభంలో రోగి తల్లి పేరు, రోగి చిరునామాను అడుగుతాను. తరువాత సంస్కృత మంత్రాలను రహస్యంగా చదవడం ప్రారంభిస్తాను. రోగికి ఉపశమనం కలుగుతుండగనే, కొబ్బరి కాయను ముక్కలుగా పగులగొట్టిన తరువాత కొంత ఉప్పును రుచి చూడమని చెబుతాను. రోగి ఉప్పు తాలూకూ ఉప్పదనాన్ని గుర్తించగనే, రోగి ఆరోగ్యవంతుడైనట్లు నిర్దారించవచ్చును.”

ఫోటోగ్యాలరీకోసం ఇక్కడ క్లిక్ చేయండి

సర్మాన్ గోయల్ పేరు గల రోగి మాతో మాట్లాడుతూ “ ఒకరోజు, నేను ఇంటిని శుభ్రం చేస్తుండగా, నా రెండు కాళ్ళపై పాము కాటు వేసింది. నేను భగవత్గారు ఉన్న ప్రాంతానికి చేరుకోగానే నా బాధ నిమిషాలలో నయమైపోయింది. నేను వారికి సదా కృతజ్ఞడునై ఉంటాను.” సర్మాన్ గారి వలే భగవత్ సహాయంతో పాము కాటు ప్రమాదం నుంచి బయటపడిన వారు అనేక మంది ఉన్నారు. తన రోగుల వివరాలతో కూడిన మూడు పుస్తకాలను ఆయన నిర్వహిస్తున్నారు.
Shruti AgarwalWD


రోగ నివారణకు గాను ఆయన నయాపైసా కూడా తీసుకోరు ఎందుకంటే జరుగుతున్నదంతా సాయిబాబా అనుగ్రహంతోనే సాగుతున్నదని ఆయన భావిస్తున్నారు కనుక. జమీల్ అనే వ్యక్తి మాతో చెప్పిన దాని ప్రకారం తన స్వంత పట్టణానికి చెందిన ఒక మహిళ పాము కాటుతో బాధపడుతుండగా స్నేహితుని దగ్గర భగవత్ ఫోను నెంబరు తీసుకొని ఫోను చేయగా కొద్ది నిమిషాలలో ఆమె బాధ తొలగిపోయింది.
చర్చలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే ఇక్కడ క్లిక్ చేయండి

Shruti AgarwalWD
గుదము అంచున చేతికి తగిలే అర్శమూలలు, మొలలు, సటికాయ్, కామెర్లు తదితర వ్యాధిగ్రస్థులకు ఆయన నాగపంచమి పండుగనాడు స్వస్థత చేకూరుస్తూ ఉంటారు. కానీ పాము కాటుకు విరుగుడు ద్వారానే ఆయన బహుళ ప్రాచుర్యం పొందారు. ప్రదీప్ సింగ్ అనే రిజర్వ్ ఇన్స్పెక్టర్ మాతో మాట్లాడుతూ “ నా స్వీయ అనుభవం నాకు భగవత్గారిపై విశ్వాసాన్ని కలిగించింది. ఒకరోజు నేనొక పామును అంతటా చూసాను, నా కార్యాలయం మరియు ఇంటితో సహా. అటువంటి పరిస్థితి నుంచి నన్ను భగవత్ గారు కాపాడారు.
ఫోటోగ్యాలరీకోసం ఇక్కడ క్లిక్ చేయండి

మరోవైపు చూస్తే, మహారాజా యశ్వంత్ సింగ్ ఆసుపత్రి ప్రధాన వైద్యుడు అశోక్ బాజ్పేయి పాముకాటు విరుగుడుకు ఇటువంటి ప్రక్రియలను తోసిపుచ్చారు. ఆయన మాట్లాడుతూ “ మన దేశంలోని 70 శాతం పాముల్లో విషం ఉండదు. సహజంగా పాము అంటే ఉన్న భయంతో ప్రజలు మరణిస్తుంటారు. పాము కాటు పొందిన సమయంలో వైద్యుని పర్యవేక్షణలో చికిత్స అత్యంత ఆవశ్యక” అని తెలిపారు.
Shruti AgarwalWD


ఎవరేమని అనుకున్నా, ఇది వారి అభిప్రాయము. మీరు ఈ విజయం వెనుక గల నిజానిజాలను తెలుసుకోవాలనుకుంటే, 0731 - 2535534 ఫోను నెంబరుకు కాల్ చేయండి.

ఈ విశ్వాసానికి ఆరంభం:
యశ్వంత్ భగవత్ మాకు తెలిపిన దాని ప్రకారం మూలికల ఉపయోగాన్ని ఆయన తన తల్లి నుంచి బాల్యంలోనే నేర్చుకున్నాడు. పాముకాటు విరుగుడు ప్రక్రియను పేరొందిన ఇంద్రజాలికుడు, నూర్ ఖాన్ సాహబ్ నుంచి తెలుసకున్నాడు. భగవంతుని దయతో గత 25 సంవత్సరాలుగా ఈ వృత్తిని నిర్వహిస్తున్నట్లు ఆయన వినమ్రతతో చెప్పాడు.

చర్చలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే ఇక్కడ క్లిక్ చేయండి.