శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. »
  3. ఏది నిజం
  4. »
  5. కథనం
Written By వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT

కూరగాయల కత్తితో శస్త్రచికిత్స చేసే అభినవ దేవుడు

WD
"మన దేశం అమాయకులతో నిండిపోయింది. దేవుడిని అని చెప్పుకునే మోసగాని వలలో పడి నేను కూడా అమాయకులలో ఒకడినైపోయాను". సత్యనామ్ విఠల్‌దాస్ చేతిలో మోసపోయిన మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సెమ్‌ల్యా గ్రామస్థుడైన సురేష్ బాగడీ అనే వ్యక్తి మాతో అన్న మాటలివి. రాజస్థాన్ రాష్ట్రం, బాన్సవాడ జిల్లాలోని ఛేంచ్ గ్రామానికి చెందిన మానవాతీత శక్తులు కలిగిన వ్యక్తిని గురించిన సమాచారం కొన్ని మాసాల క్రితం సురేష్ వినడంతో ఈ కథకు అంకుర్పారణ జరిగింది.

తమ గ్రామంలో పంపిణీ కాబడిన సీడీలు మరియు కరపత్రాల ఆధారంగా దేవునిగా చెప్పుకునే సత్యనామ్ విఠల్‌దాస్ కూరగాయల కత్తితో శస్త్రచికిత్సలు జరుపుతున్న వైనాన్ని సురేష్ తెలుసుకున్నాడు. అంతేకాక ఎయిడ్స్, క్యాన్సర్ తదితర వ్యాధులు ఉచితంగా నయం చేయబడతాయని కరపత్రం తేల్చి చెప్పింది. కానీ శస్త్రచికిత్సకు వెళ్ళిన సురేష్ తాను మోసపోయినట్లు తెలుసుకున్నాడు.
WD


మేము కూడా ఆ సీడీని చూశాము. అందులో సత్యనామ్ దైవాంశసంభూతుడని చిత్రీకరించబడి ఉంది... అతని రక్షణ కోసం పోలీసు దుస్తులను ధరించిన వ్యక్తులు కొందరు సీడీలో మాకు కనిపించారు. అమాయకులైన గ్రామీణ ప్రజలు సులువుగా ఆకర్షితులయ్యేందుకు సర్వం సిద్దమైన తీరు మాకు అగుపించింది.

WD
వీడియోను చూసినట్లయితే శస్త్రచికిత్సలో అతని ఎత్తుగడ మీకు అర్థమవుతుంది. రోగి కడుపులో నుంచి ఒక మాంసపు ముక్కను అతడు బయటకు తీసి వ్యాధి నివారించబడిందని అతడు నమ్మబలుకుతాడు. వాస్తవానికి శస్త్రచికిత్స ప్రారంభానికి ముందే తన చేతిలో మాంసపు ముక్కను దాచుకునే అతను, శస్త్రచికిత్స ముగియగానే అదే మాంసపు ముక్కను రోగి శరీరంలో నుంచి తీసినట్లు అతడు నటిస్తాడు.

అతడు శస్త్రచికిత్స సమయం అసాధారణంగా ఉంటుంది. అదేలాగంటే అతడు శస్త్రచికిత్సను శనివారం అర్థరాత్రి మొదలుపెట్టి తెల్లవారుఝూమున మూడు గంటల దాకా కొనసాగిస్తాడు. శస్త్రచికత్స చేసే సమయంలో ప్రధాన ద్వారాలు మూసివేయబడతాయి. అదే సమయంలో దేవాలయం తలుపులను అతని అంగరక్షకులు మూసివేస్తారు. తన గ్రామానికి చెందిన ఐదుగురు మహిళలు ఇక్కడ శస్త్రచికిత్స చేయించుకోగా, వారిలో ఒకరి ఆరోగ్య పరిస్థితి విషమించిందని శస్త్రచికిత్స బాధితురాలైన రాజు బాయి మాతో అన్నది.
WD


సీడీలో చూపినట్లుగా అతడు శస్త్ర చికిత్స చేయడని ఆమె వెల్లడించింది. వ్యాధికి గురైన ప్రాంతంలో కత్తితో చిన్నగాటును అతడు చేయడంతో ఆమెకు ఉపశమనం కలుగుతుందని చెప్పాడు. అంతేకాక ఆ గాటుపై బూడిదను అద్దుతాడు. ఇదిలా ఉండగా బూడిదపై కొందరు మా ఎదుట అనుమానాలు వ్యక్తం చేశారు. మత్తు మందును బాబా బూడిదలో కలిపి ఉండవచ్చునని వారి సందేహం.
WD
అంతేకాక అతడు కొబ్బరి కాయలను పగులకొట్టి పువ్వులను, కుంకుమను బయటకు తీస్తాడు. కానీ అదేమీ పెద్ద అద్భుతం కాదు ఎందుకంటే సామాన్యమైన గారడీవాళ్ళు సైతం ఆ ప్రక్రియను ఇట్టే చేసి చూపిస్తారు కనుక. కానీ అమాయక ప్రజలు దానిని దైవశక్తిగా పరిగణిస్తున్నారు. కానీ కొబ్బరి కాయ రెండు భాగాలు ఏదో ద్రావకంతో అతకబడి ఉండటం తాను గమనించానని రోగులలో ఒకడైన సునీల్ మాతో చెప్పాడు.

అంతేకాదు ఇక్కడ ఏదీ ఉచితంగా చేయరని సునీల్ మాతో అన్నాడు. అదెలాగంటే శస్త్ర చికిత్సకు రూ. 500 ను మరియు ఔషధాలకు రూ.300 ను బాబా అనుచరులు కొందరు రోగుల నుంచి ముక్కుపిండి మరీ వసూలు చేస్తుంటారు. మా పరిశీలనలో తేలిందేమిటంటే, తనను తాను దేవునిగా చెప్పుకునే సత్యనామ్ అనే మోసగాడు పకడ్బందీగా అమాయక ప్రజలను మోసగిస్తున్నాడు.

అటువంటి మోసగాళ్ళను నమ్మవద్దని మా పాఠకులకు సలహా ఇస్తున్నాము. దేవుడు లేదా మతం పేరిట మోసాలకు పాల్పడే వ్యక్తులు మీ చుట్టుపక్కల ఉన్నట్లయితే మాకు తెలియజేయండి... అలాగే ఈ కథనంపై మీ అభిప్రాయాన్ని రాసి పంపండి….