శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. »
  3. ఏది నిజం
  4. »
  5. కథనం
Written By Shruti Agarwal

దేహంలోని రాళ్ళను నోటితో పీల్చివేసే చికిత్స

Shruti AgarwalWD
“ఆస్థా మరియు అంథవిశ్వసాల” కొనసాగింపులో భాగంగా మా తరువాతి ఎంపిక మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయినీ పట్టణానికి సమీపంలో గల “రాలయా” గ్రామం. ఈ గ్రామంలోని ఒక వృద్ధురాలు దేహం నుంచి రాళ్ళను పీల్చివేయడం ద్వారా రోగుల రాళ్ళ వ్యాధిని నయం చేస్తుందని విన్నాం. ఈ వింతను ప్రత్యక్షంగా చూసేందుకు ఒక గ్రామీణుడి సహకారంతో రాలయాటకు దారి తెలుసుకున్నాం.

ఫోటో గ్యాలరీకోసం ఇక్కడ క్లిక్ చేయండి

చుట్టూ అనేక మంది చేరి ఉండగా సీతా బాయి అనే వృద్ధురాలు తన పనిని మొదలుపెట్టడానికి సిద్దంగా ఉన్నది. ఒక బాలుని వ్యాధి వివరాలు అడిగిన ఆమె అనంతరం దేహంలోని బాధిత ప్రాంతాన్ని పీల్చడం ప్రారంభించింది. కాసేపటి తరువాత నోటి నుంచి కొన్ని రాతి ముక్కలను ఆమె విసిరింది. రాళ్ళ వ్యాధి నుంచి బయటపడేందుకు అనేక మంది అక్కడ బారులు తీరి కనిపించారు.
Shruti AgarwalWD


సీతాబాయి మాతో మాట్లాడుతూ “నేనీ వృత్తిలో గత 18 సంవత్సరాలుగా ఉన్నాను.” తన సంభాషణను కొనసాగిస్తూ “ ఈ ప్రక్రియలో ఉండగా గాలిలోని 52 ప్రాంతాలలో విహరిస్తున్న భావనకు నేను లోనవుతాను. నిర్దారిత ప్రాంతాన్ని అనుసరించి పనితీరును మారుస్తాను. “మా” పై నమ్మకంతో ఈ చికిత్స ను చేస్తున్నాను. పూర్తి విశ్వాసం, గౌరవం ఉంటే ఎలాంటి వ్యాధి అయినా నయమవుతుంది.”

చర్చలో పాల్గొనాలని భావిస్తున్నారా? అయితే ఇక్కడ క్లిక్ చేయండి.

Shruti AgarwalWD
ఒక వైపు సీతాబాయి తన పనిని త్వరగా చేస్తుంటే మరోవైపు ఆమె వెనుకనే ఉన్న వ్యక్తి రోగులను పచ్చి కూరల మిశ్రమం, వంకాయలు, టమోటాలను తినవలసిందిగా ముందు జాగ్రత్త చర్యగా రోగులకు సూచిస్తున్నాడు. కొన్ని మూలికా ఔషధాలను కూడా అతను రోగులకు పంపిణీ చేస్తున్నాడు.

ఫోటో గ్యాలరీకోసం ఇక్కడ క్లిక్ చేయండి
రాజస్థాన్, కాన్పూర్ మరియు గ్వాలియర్ సీతాబాయికి మంచి పేరుంది. కిడ్నిలో రాయిని కలిగి వ్యాధినివారణ కోసం జైపూర్ నుంచి వచ్చిన 75 సంవత్సరాల మహిళ శ్రీమతి భగవాన్ దేవిని మేమక్కడ చూసాము.

ఆమె మాట్లాడుతూ “ ఈ వయస్సులో రాయి తొలగింపు కోసం నా దేహం శస్త్ర చికిత్సకు అనుకూలించదు. స్వస్థత ప్రక్రియలో నొప్పికి బదులుగా కొంత ఒత్తిడికి లోనవతున్నాను. నెల రోజులు గడిచాక రమ్మని ఆమె నాతో అన్నది. నెల రోజుల తరువాత సైనోగ్రఫీ చేపట్టమని కూడా సూచించింది.
Shruti AgarwalWD


చికిత్స కోసం ఒకటికి రెండుసార్లు వచ్చిన వారు అక్కడ అనేక మంది ఉన్నారు. తానిక్కడకు రెండవసారి వచ్చినట్లు మనోజ్ మాతో చెప్పాడు. మొదటి సారి చికిత్స అనంతరం నొప్పిలో కొంత ఉపశమనం పొందానని, రెండవ చికిత్స అనంతరం తుది ఫలితం తెలుసుకునేందుకు తన స్వంత ఊరైన గ్వాలియర్లో ఆల్ట్రా సోనిక్ పరిక్ష చేయించుకుంటానని మనోజ్ తెలిపాడు.

చర్చలో పాల్గొనాలని భావిస్తున్నారా? అయితే ఇక్కడ క్లిక్ చేయండి.

Shruti AgarwalWD
సీతాబాయి మాటలను అనుసరించి, రోగులకు ఎలా చికిత్స చేయాలో ఆమెకు తెలియదు. చికిత్స అంతా భగవంతుడు చేస్తున్నాడు. సీతాబాయిని కలిసిన అనంతరం తమకు స్వస్థత చేకూరిందని అనేక మంది చెబుతున్నా సైన్సు దీనిని అంగీకరించడం లేదు. శస్త్రచికిత్సానిపుణుడైన డాక్టర్ అశోక్ చౌదరి మాతో మాట్లాడుతూ “ రాళ్ళను పీల్చడం ద్వారా నివారించడం అసాధ్యం.

ఫోటో గ్యాలరీకోసం ఇక్కడ క్లిక్ చేయండి

రాయికి చెందిన చిన్న ముక్కలు మూత్రం ద్వారా వెలుపలకు పంపబడతాయి. శరీరంలో రాయి పరిస్థితిపై చికిత్స ఆధారపడి ఉంటుంది.” తాను వ్యాధులను ఎలా నివారిస్తున్నదీ తనకు ఏమాత్రం తెలియదని సీతాబాయి మాతో అన్నది. నా చిన్నతనం నుంచి నేను “దుర్గా మా” భక్తురాలను. నేనీపనిని 18 సంవత్సరాలుగా చేస్తున్నట్లు గుర్తు.

చర్చలో పాల్గొనాలని భావిస్తున్నారా? అయితే ఇక్కడ క్లిక్ చేయండి.