శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. »
  3. ఏది నిజం
  4. »
  5. కథనం
Written By వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT

మానవ జీవితంపై గ్రహాల ప్రభావం!

WD
జ్యోతిష్య శాస్త్రంపై ప్రజలు అపారమైన విశ్వాసం ప్రదర్శిస్తుంటారు. ఏదైనా పనిని చేపట్టాలంటే శ్రేయోభిలాషుల సలహాల కన్నా తమ జాతకం పట్ల అత్యంత నమ్మకం చూపుతుంటారు. అది వివాహమైనా, వ్యాపారమైనా జాతకాన్ని సంప్రదించిన తర్వాతనే పనిని ప్రారంభిస్తుంటారు. ఇందులో నవ గ్రహాల గమనం ప్రధానమైంది. ఈ వారం ఏది నిజం శీర్షికలో వచ్చే సంవత్సరం కాలం దాకా మానవులకు శుభం చేకూర్చే ఒక ప్రత్యేకమైన ఘటనను మీకు అందిస్తున్నాం

ఈ సంవత్సరం నవంబర్ 16న గురు గ్రహ గమనం సంభవించింది. గడచిన సంవత్సర కాలంగా వృశ్చిక రాశిలో ఉన్న గురుడు ఆ రోజున ధనూరాశిలోకి ప్రవేశించాడు. ప్రాతఃకాలాన 4:24 గంటలకు ధనూరాశిలోకి గురుడు ప్రవేశించిన సందర్భాన్ని పురస్కరించుకుని తమిళనాడుకు చెందిన ప్రజలు దేవాలయాలకు చేరుకుని తమకు అంతా శుభం జరగాలని కోరుకుంటూ గురు భగవాన్‌ విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు.

గురు భగవాన్ సన్నిధితో కూడుకున్న దేవాలయాలు తమిళనాడులో అనేకం ఉన్నప్పటికీ, పరమ శివుని గురుడు పూజించిన తంజావూర్ జిల్లాలోని ఆలంగుడి‌లోని ఆబాత్ సహాయేశ్వర ఆలయ క్షేత్రం, గురు గమనం రోజున అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంటుంది.
WD


ఆ రోజున పెద్ద సంఖ్యలో భక్తులు ఈ దేవాలయానికి చేరుకున్నారు. గురు భగవాన్ సందర్శనార్థం భారీ వరుసలలో వారు గంటల కొద్దీ వేచి ఉండి, తమ జీవన గమనం సాఫీగా సాగాలని వేడుకున్నారు. ఇతర దేవాలయాలలో గురు భగవానుని ప్రత్యేక దర్శనాన్ని భక్తులు చేసుకున్నారు.

WD
గురు గమనానికి ఎందుకు ఇంత ప్రాధాన్యత చేకూరింది? ఈ సందేహాన్ని మా జ్యోతిష్కులైన డా. కేపీ. విద్యాధరన్ ముందు ఉంచాము. ఆయన ఈ విధంగా చెప్పుకొచ్చారు. "రాశి మండంలో నాలుగు గ్రహాలకు చెందిన గమనానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. తమ జాతకాలలోని నక్షత్రాలను అనుసరించి వ్యక్తులపై శని, గురు, రాహు మరియు కేతువుల గమనం ప్రభావం చూపుతుంది.

గురుని మినహాయించగా మిగిలిన మూడు గ్రహాలు వ్యక్తుల జీవితాలపై దుష్ప్రభావాన్ని చూపుతాయి. పైన పేర్కొన్న నాలుగు గ్రహాలలోను గురు గ్రహం శుభానికి సంకేతం. మన జీవితాలలో చోటు చేసుకునే వివాహం, విద్య, వ్యాపారం మరియు పదోన్నతి తదితరాలలో గురుడు సానుకూలంగా ప్రభావం చూపుతాడు. రాజకీయాలలో ఉండేవారికి అధికారం కట్టబెట్టడంలో గురు భగవాన్ ప్రభావం కీలకమైంది.
WD


అందుకనే ప్రత్యేక రోజులలో మాత్రమే కాకుండా ఇతర దినాలలో కూడా రాజకీయ నాయకులు గురు భగవాన్‌ను పూజిస్తుంటారు. తదనుగుణంగా అన్ని వర్గాలకు చెందిన ప్రజలు అనగా రాజకీయ నేతలు, జిల్లా స్థాయి అధికారులు, వ్యాపారవేత్తలు, మరియు ధనవంతుల నుంచి ఉద్యోగుల వరకు దేవాలయాలకు విచ్చేస్తుంటారు."
WD
వేదకాలం నుంచి జ్యోతిష్యశాస్త్రం భారతీయ సంస్కృతీ సంప్రదాయాలతో పెనవేసుకుపోయింది. మన పూర్వికులు ఎటువంటి పరికరాలు లేకుండానే జ్యోతిష్య శాస్త్రం ప్రామాణికంగా గ్రహాలు, గ్రహ స్థితిగతులు మరియు వాటి స్వభావానుసారం గ్రహాలకు నామకరణం చేశారు. కనుకనే జీవితానికి సంబంధించిన కీలకమైన నిర్ణయాలపై తాము అంత ఖచ్చితంగా చెప్పలేమని జ్యోతిష్కులు చెప్తుంటారు.

కానీ పురాతనమైందిగా చెప్పబడే ఈ జ్ఞానానికి అందరూ ఆమోదించక పోగా, హేతుబద్ధం కానీ శాస్త్రంగాను, మూఢనమ్మకం గాను విమర్శిస్తుంటారు. మానవుల ఆలోచనలు మరియు చర్యలే వారి భవిష్యత్తును నిర్దేశిస్తాయని, ఇటువంటి నమ్మకాలను విశ్వసించే వారిలో కొందరు నిరాశావాదంలో కూరుకుపోతారని వారు గట్టిగా చెప్తుంటారు. " జీవన యానం సాగించు, సవాళ్ళను స్వీకరించు, వాటిని చాకచక్యంతో ఎదుర్కొని తదనుగుణంగా పొందిన అనుభవం చుక్కానిగా ముందుకు సాగు అనేది" వారి నినాద
WD


తాము కనుగొన్న ఆవిష్కారాలు మరియు హేతువులు ప్రాతిపదికన సైన్సు ప్రపంచం ఏమి చెప్తున్నప్పటికీ, సమస్త మానవాళికి చెందిన విద్యావంతులు, నిరక్షరాస్యులు తమ స్వీయ అనుభవమే తార్కాణంగా ముందుకు సాగుతుంటారు. ఈ వ్యవహారంపై మీ అభిప్రాయం మరియు మీ అనుభవాలను మాకు రాయండి.