శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. »
  3. ఏది నిజం
  4. »
  5. కథనం
Written By వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT

రహస్యాలకు నిలయం మసోనిక్ లాడ్జి

WD
అది భయం కలిగించే ఓ భవనం. రాత్రి వేళలో ఆ భవనం నుంచి వింతైన అరుపులు వినపడుతుంటాయి. అది మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరానికి సమీపంలో గల మోవ్‌లో నెలకొని ఉంది. అసలు సంగతేంటో తెలుసుకుందామని అక్కడికి వెళ్లాం. అక్కడికి వెళ్లిన మాకు స్థానికుల ద్వారా మరికొన్ని రహస్యాలు తెలిశాయి.

ఈ వారం ఏది నిజం శీర్షికలో భాగంగా మసోనిక్ సొసైటీ వెనక దాగున్న రహస్యాలను మీకు పరిచయం చేస్తున్నాం. సోలమన్ రాజు పాలనలో ఈ లాడ్జి నిర్మితమైంది. సమాజంలోని అనేక మంది మేధావులు ఒకప్పుడు మసోనిక్ సొసైటీలో సభ్యులుగా ఉండేవారు.

లాడ్జికి చెందిన సభ్యుల అనుమానిత కార్యకలాపాలతో ఈ ప్రాంతం మర్మమైనదిగా స్థానికులు విశ్వసిస్తుంటారు. అదేసమయంలో తాంత్రిక విద్యలను కూడా ఇక్కడ చేపడతుంటారని ప్రజల నమ్మకం. అంతేకాక మసోనిక్‌లు స్వర్గలోక రహస్యాలపై అధ్యయనం లేదా దెయ్యాలను పూజించడం తదితర కార్యకలాపాలను చేపడుతుంటారు. ఈ పుకార్లకు సంబంధించిన సాక్ష్యాలు ఎవరి దగ్గర లేవు. ఈ రహస్యాలను వెలికితీయాలని మేము పూనుకున్నాము.

మా ప్రయత్నంలో భాగంగా జడ్డీ హోలీవర్ అనే వ్యక్తిని కలిశాము. లాడ్జితో అతనికి గల అనుబంధం 25 సంవత్సరాల నాటిది. మాసోనిక్ సొసైటీకి చెందిన ఇతర సభ్యులతో చర్చించిన అనంతరం మాసోనిక్ సొసైటీ తత్వాన్ని మాకు చెప్తానని అతను మాట ఇచ్చాడు. ఎందుకంటే మాసోనిక్‌లు తమ విశ్వాసాలను అత్యంత రహస్యంగా ఉంచుతారు. మా అభ్యర్థన మేరకు అతడు సొసైటీ గురించి వెల్లడించడం ప్రారంభించాడు.
WD


మేసోన్‌లు మమ్మల్ని వారి దేవాలయానికి ఆహ్వానించారు. నిర్దేశిత సమయానికి మేము అక్కడకు చేరుకున్నాము. లాడ్జి ఎవరూ ఉండని ప్రదేశంలో నిర్మితమైంది. చీకట్లో ఆ లాడ్జి చాలా భయానకంగా కనిపిస్తోంది. కొంతసేపటికి, మేసోన్ హోలివర్, మేసోన్ రాధా మోహన్ మాలవ్యా, మేసోన్ మేజర్ బీ ఎల్ యాదవ్, మేసోన్ కమల్ కిషోర్ గుప్తాల కూడా లాడ్జికి చేరుకున్నారు. లాడ్జి ఆవరణలోకి ప్రవేశించగానే మాకు ఒక నేత్రం తాలూకు చిత్రం కనిపించింది. మాసోనిక్‌లు నేత్రాన్ని పూజిస్తారని తెలుసుకున్నాము.

WD
అదేసమయంలో సొసైటీకి చెందిన ప్రముఖ సభ్యులకు చెందిన పురాతనమైన వర్ణచిత్రాలు మా దృష్టిలో పడ్డాయి. అనంతరం మసోనిక్ దేవాలయంలోకి ప్రవేశించాము. సోలమన్ రాజు పాలనలో ఈ లాడ్జి నిర్మితమైంది. సోలమన్ రాజు తత్వాన్ని వెల్లడించే కొన్ని రేఖాచిత్రాలు గోడలకు వేలాడదీయబడి ఉన్నాయి. అయితే ఈ దేవాలయంలో జరిగే కార్యకలాపాలు నరమానవునికి తెలియవు.

మీరు మానవాతీత శక్తులను కలిగి ఉన్నట్లయితే, మాసోనిక్‌గా మారడానికి మీరు అర్హులవుతారని పెద్దవారైన మాసోన్‌లు మాతో అన్నారు. ఎవరిని పడితే వారిని సొసైటీలో సభ్యులుగా చేర్చుకోమని స్పష్టం చేశారు. సొసైటీలో చేరిన కొత్త సభ్యుని 'డేకొన్' అంటారు. అర్హతను సముపార్జించుకున్న డేకొన్, 'సీనియర్ డేకొన్' అవుతారు. అనంతరం 'జూనియర్' మరియు 'సీనియర్ 'వార్డెన్‌'గా గుర్తింపబడతారు. చివరకు 'మాసోన్‌'గా అవతరిస్తారు. మాసోనిక్ కార్యకలాపాలలో పరిపూర్ణత సాధించినవారు 'వర్చువల్ మాస్టర్' పదవిని అలంకరిస్తారు. మాసోన్ బృందానికి 'వర్చువల్ మాస్టర్' నేతృత్వం వహిస్తారు.

ఖచ్చితమైన మాసోన్‌గా మారడానికి సభ్యులు మూడు డిగ్రీలలో అర్హతను సంపాదించాలి. తొలి దశలో, మానవాళికి సేవ చేసే రీతిలో అద్భుతమైన నిర్మాణాలను ఒక కార్మికుని తరహాలో అతడు నిర్మించాలి. ఇక రెండవ దశలో, మంచి పనులు మనిషి జీవితాన్ని సుందరమైన దేవాలయంగా మారుస్తుందని బోధిస్తారు. చివరగా మూడవ దశలో మరణానంతర జీవనాన్ని బోధిస్తారు. అలాగే సమాధి చెందిన అనంతరం దేహంలోని ఏ ఎముక శాశ్వతంగా ఉంటుందో తెలియచేస్తారు. ఇందులో భాగంగా మానవ చర్మాన్ని ఉపయోగిస్తారు. ఈ కార్యకలాపాలతో ప్రజలలో మాసోనిక్ సొసైటీ పట్ల అనేక అనుమానాలు చోటు చేసుకున్నాయి.

మాసోనిక్ సభ్యులు వారానికి ఒకసారి అర్థరాత్రి వేళ సమావేశమవుతారు. వారి సమావేశమంతా చీకట్లోనే జరుగుతుంది. ఆ సమయంలో ఇతరులకు కనిపించని రీతిలో తమ కార్యకలాపాలు సాగించడంతో, వారు దెయ్యాలను పిలుస్తుంటారని ప్రజల విశ్వాసం. అయితే అది వాస్తవం కాదని వారు మాతో అన్నారు. మరి దేవాలయంలోని చదరంగం బల్ల మరియు ఖడ్గం సంగతేమిటని మేము వారిని అడిగాము.
WD


దానికి వారు సమాధానమిస్తూ మాసోన్ దేవాలయం పైథాగరస్ సిద్దాంతాన్ని అనుసరిస్తుందని వెల్లడించారు. తదనుగుణంగానే పలు రేఖాచిత్రాలను రూపొందించడంతో పాటు వైవిధ్యమైన దుస్తులు, ఆభరణాలను ధరించి తమదైన శైలిలో ఆసన సన్నాహాలను చేసుకుంటామని తెలిపారు. శాస్త్రీయ పద్ధతిలో వారు సాగించే చర్చలను సాధారణ ప్రజలు తప్పుగా అర్ధం చేసుకుంటున్నారు.
WD
సోలమన్ రాజు పాలనలో కాలు లేదా చెయ్యి నరికివేయడం తదితర కఠినమైన శిక్షలు అమలులో ఉండేవి. కనుకనే లాడ్జి నుంచి వినవచ్చే వింతైన అరుపులు, లాడ్జిలోని సభ్యులు చేతబడి లాంటి అనుమానస్పద కార్యకలాపాలు నిర్వహిస్తుంటారని ప్రజలు అనుమానించడానికి దోహదపడింది. ప్రస్తుత కాలంలో సైతం మేసోన్‌లు చేతబడి చేస్తారని ప్రజలు విశ్వసిస్తుంటారు. కానీ అది వాస్తవం కాదు.

వారు సోదర సంబంధానికి ప్రాధాన్యతను ఇస్తుంటారు. మేసోనిక్ సొసైటీలోని ప్రతి సభ్యుడు, తోటి సభ్యుని సోదరభావంతో చూడాలని చెప్పబడింది. భవన నిర్మాణానికి సంబంధించిన పనిముట్లను వారు కలిగి ఉంటారు. ఈ పనిముట్లు మరియు చిహ్నాలు సొసైటీ పట్ల ప్రజలలో పలు అనుమానాలకు తావిస్తున్నాయి. ఈ పనిముట్లను గురించి మేసోన్‌లను మేము ప్రశ్నించగా, పురాతన కాలం నాటి శిల్ప కళా పద్ధతులతో ఇళ్ళను నిర్మించడానికి వాటిని ఉపయోగిస్తామని వారు బదులిచ్చారు.
WD


వర్తమానంలో ప్రపంచవ్యాప్తంగా 240 మాసోనిక్ లాడ్జిలు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. ఈ లాడ్జిలన్నీ పరస్పర సంబంధాలను కలిగి వాటి స్వీయ విశ్వాసంతో పని చేస్తుంటాయి. ప్రతి లాడ్జి ప్రత్యేకమైన సంఖ్యను కలిగి ఉంటుంది. ఉదాహరణకు మోవ్‌ లాడ్జి సెయింట్ పాల్ నెంబర్. - 389 (ఎస్‌సీ). ఆ విధంగా మాసోనికి లాడ్జీకి చేరుకున్న మేము అక్కడి రహస్యాలను వెలికి తీయడానికి ప్రయత్నించాము.

కానీ తెర వెనుక రహస్యాలు ఎన్నో... అంతుతెలియకుండా మిగిలిపోయాయి... మాసోనిక్ లాడ్జి గురించి మీరేమి అనుకుంటున్నారో మాకు రాసి పంపండి.